చంద్రగిరి:
నియోజకవర్గ కేంద్రమైన చంద్రగిరి మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద శనివారం రెవిన్యూ ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైజాగ్ రూరల్ తహశీల్దార్ రమణయ్య దారుణ హత్యకు కారుకులైన నిందితులను ఎలాంటి నిర్లక్ష్యము చేయకుండా తక్షణమే అరెస్టు చేయాలని, అధిక భూ వివాదాలు ఉన్న మండలాల తహశీల్దార్లుకు ప్రభుత్వం ప్రత్యేక రక్షణ కల్పించాలని, విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగి పైన విధి ఆటంకములు, దాడులకు సంబంధించి ,దోస్తులపైన చర్యలు తీసుకున్నందుకు కఠినమైన చట్టం తీసుకురావాలని కోరారు. తహశీల్దార్ రమణయ్య కుటుంబాన్ని ప్రభుత్వంఆదుకోవాలని డిమాండ్ చేశారు. రమణయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, కార్యాలయ సిబ్బంది, వీఆర్వోలు పాల్గొన్నారు.