నాకున్న సైన్యం, బలం ప్రజలే
రామాయణం, మహాభారతంలోని విలన్లు అందరూ ఇక్కడే ఉన్నారు
నా ఐదేళ్ల పాలన చూడండి, చంద్రబాబు పాలన చూడండి
తన పాలనను ప్రజలకు వివరించిన సీఎం జగన్
చంద్రబాబు పాలనలో ఒక్క రూపాయి అయినా ఖాతాలో పడిందా అంటూ విమర్శలు
దెందులూరు సిద్ధం సభలో సీఎం జగన్
దెందులూరు:
వచ్చే ఎన్నికల రణక్షేత్రంలో ప్రజలే కృష్ణుడు, తానే అర్జునుడినంటూ సీఎం జగన్ దెందులూరు సభలో ప్రసంగించారు. పేదల భవిష్యత్ ను కాటేసే దుష్టచతుష్టయంపై యుద్ధానికి సిద్ధమా? అన్నారు. నాకున్న సైన్యం, బలం ప్రజలే అని సీఎం జగన్ అన్నారు.నేనెప్పుడూ ఒంటరివాడు కాదు….కోట్లాది మంది గుండెల్లో ఉన్నా అంటూ దెందులూరు సిద్ధం సభా వేదికగా సీఎం జగన్ ప్రసగించారు. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన సిద్ధం సభకు భారీగా జనం హాజరయ్యారు. ఈ సభలో పాల్గొన్న సీఎం జగన్… సిద్ధమా అంటూ ప్రసంగం ప్రారంభించారు.
మరో చారిత్రక విజయాన్ని మీరంతా సిద్ధమా? అన్నారు. పేదల భవిష్యత్‌ను కాటేసే ఎల్లో వైరస్‌పై యుద్ధానికి సిద్ధమా? అన్నారు. ఇంటింటి భవిష్యత్తును మరింత మార్చేందుకు సిద్ధమా? దుష్టచతుష్టయంపై యుద్ధానికి సిద్ధమా? అంటూ సీఎం జగన్ ప్రసంగించారు. జగన్ ఒంటరివాడు కాదన్నది దెందులూరు సభలో కనిపిస్తున్న జనమే నిజమన్నారు. కోట్లాది మంది గుండెల్లో జగన్ ఉండటమే నిజం అన్నారు. నాకున్న సైన్యం, బలం ప్రజలే అంటూ సీఎం జగన్ ఉత్సాహభరితంగా ప్రసంగించారు.రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, ఎల్లో మీడియా, దత్తపుత్రుడే అని సీఎం జగన్ అన్నారు. ఇంతమంది తోడేళ్ల మధ్యలో జగన్ ఒంటరిగానే కనిపిస్తాడని, కానీ నిజం ఏంటంటే కోట్ల మంది హృదయాల్లో జగన్ ఉన్నాడన్నారు. వచ్చే ఎన్నికల రణక్షేత్రంలో ప్రజలే కృష్ణుడైతే నేను అర్జునుడిన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై టీడీపీ, జనసేన దండయాత్ర చేస్తుందన్నారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిందన్నారు. పేదవాడి సంక్షేమం, భవిష్యత్తుపై దుష్టచతుష్టయం దాడి చేస్తుందని మండిపడ్డారు. వైసీపీ పాలనలో అవినీతి, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించామన్నారు. వైసీపీ సంక్షేమ పాలనకు ప్రతీ పేద కుటుంబమే సాక్ష్యం అన్నారు. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు గెలవడమే తమ లక్ష్యం అన్నారు. చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు తేడా గమనించాలన్నారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ ఏ గ్రామంలోనైనా వైసీపీ పాలన మార్పులను గమనించవచ్చన్నారు. భవిష్యత్తులో పింఛన్ మరింత పెరగాలంటే వైసీపీకి అధికారం ఇవ్వాలని సీఎం జగన్ అన్నారు.
దిశ యాప్ తో అక్కచెల్లెమ్మెలకు అండగా నిలిచామని సీఎం జగన్ అన్నారు. అక్క చెల్లెమ్మలకు ఆర్థిక స్వావలంబన అందించామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 31 లక్షల ఇళ్ల పట్టాలు అందించిందన్నారు.
రాష్ట్రంలో కొత్తగా 15 మెడికల్ కాలేజీలు, కొత్తగా 4 పోర్టులు, 10 షిప్పింగ్ హార్బర్‌లు నిర్మిస్తున్నామన్నారు. ఇప్పుడిస్తున్న రూ.3 వేల పెన్షన్ అందాలన్నా, భవిష్యత్‌లో మరింత పెరగాలన్నా మీ జగనే రావాలన్నారు. ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు అన్నారు. ఈ ఎన్నికలు చాలా ముఖ్యమని ప్రతి ఒక్కరికీ చెప్పాలన్నారు. మంచి జగన్ ప్రభుత్వంతోనే సాధ్యమని గ్రామాల్లో చెప్పాలన్నారు. పేదల కష్టాలు తీరాలంటే జగనే రావాలని చెప్పాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 57 నెలల్లో 124 సార్లు బటన్ నొక్కామన్నారు. పేదల ఖాతాల్లో రూ.2 లక్షల 55 వేల కోట్లు జమ చేశామన్నారు. ఫ్యాన్ పై నొక్కితే చంద్రముఖి బెడద శాశ్వతంగా ఉండదన్నారు. పేదల సొంతింటి కల నెరవేరాలంటే మళ్లీ జగనే రావాలన్నారు.