కదిరి
కదిరి పట్టణంలోని మానసధార ట్రస్ట్ వ్యవస్థాపకులు యం.యస్ ప్రశాంత్, హరీష్ పాఠశాల ప్రిన్సిపాల్ యం.యస్ కిరణ్ ల ఆధ్వర్యంలో ఆదివారం 300 మంది విద్యార్థులకు ఉచితంగా హనుమాన్ చిత్రాన్ని చూపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి మంచి చిత్రాలు చూసి అవగాహన తెచ్చుకొని దైవ మార్గంలో నడుస్తారన్నారు. సమాజంలో జరిగే ప్రతి విషయంపై విద్యార్థులు అవగాహన పెంచుకొని, దైవాన్ని నమ్మి మంచి సన్మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్పేస్ కళాశాల అధ్యాపకులు, హరీష్ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.