శ్రేణులకు కమలనాధుల పిలుపు
తుని
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు పై గ్రామస్థాయిలో విస్తృతస్థాయిలో ప్రచారం చేయాలని బిజెపి విస్తారక్ రాష్ట్ర కన్వీనర్ ఉన్నికృష్ణన్ పిలుపునిచ్చారు. పార్టీ సంస్ధాగత వ్యవహారాలను సమీక్షించి బిజెపిని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఆయన రాష్ట్ర పర్యటన చేపట్టారు ఇందులో భాగంగా తునికి విచ్చేసిన ఉన్నికృష్ణన్ కు స్థానిక బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పడాల విశ్వనాథ్ ఆధ్వర్యంలో కొల్లాబత్తుల ప్రవీణ్ కుమార్, టీ తమ్మయ్య, డి సూర్య, ఆచంట శ్రీకాంత్, పోలిశెట్టి మధు తదితరులు బిజెపిలో చేరారు వీరికి రాష్ట్ర కన్వీనర్ ఉన్నికృష్ణన్ కొండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మొగల వేణుగోపాల్, కో కన్వీనర్ లాలం లోవరాజు, అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జ్ డివి సూర్యనారాయణ రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రగడ చక్ర రావు తదితరులు పాల్గొన్నారు