కలసపాడు
రైతులు సాగు చేసేవారి పంటల్లో యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించాలని మండల వ్యవసాయ అధికారి జాకీర్ షరీఫ్ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని తెల్లపాడు గ్రామ పొలాల్లో రిపంటపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
వాతావరణ మర్పు లు ఉష్ణోగ్రత మరియు వర్షాభావ పరిస్థుతులు ఉండడం వలన వేసవి లో నీటిలోని ఉప్పుశాతం పెరగడం వలన వరి పంటలో నాట్లు వేసిన తర్వాత ఎదుగుదల లేకపోవడం, పసుపు రంగులోకి మారడం, చనిపోవడం జరుగుతుందన్నారు.
కాబట్టి నాట్లు వేసే ముందు ఆఖరి దుక్కిలో జింక్ ఎకరాకు 10 కేజీలు వేసుకోవాల ని ఆయన రైతులకు వివరించారు. ఆ తర్వాత నాట్లు వేసుకున్నట్లైతే పొలంలో నీటి పరిమాణం ఎండిపోకుండా చూసుకోవాలి, తరచుగా నీరు మార్చుతూ ఉండాల న్నారు.
జింక్ 2 గ్రాములు మరియు 19:19:19 – 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి వారానికి ఒకసారి 30 రోజులవరకు పిచ్కారి చేసుకోవాల ని రైతులకు సూచించారు.
దీర్ఘకాలం లో తీసుకోవలసిన జాగ్రత్తలు
పచ్చి రొట్ట ఎరువుల పెంపకం, సేంద్రియ ఎరువుల వాడకం, దమ్ము చేసే విధానం లోతుగా కాకుండా రోతోవేటర్ తో చేసుకోవడం. మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు రైతులు పాల్గొన్నారు