జిల్లా జాయింట్ కలెక్టర్ జి.గణేష్ కుమార్
కడప బ్యూరో
స్పందన, జగనన్నకు చెబుదాం కార్యక్రమాల ద్వారా అందే అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జి.గణేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాలు నందు.. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జేసీ జి.గణేష్ కుమార్ తోపాటు డిఆర్వో గంగాధర్ గౌడ్, డిప్యూటీ కలెక్టర్ ప్రత్యూష హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జేసీ జి.గణేష్ కుమార్ మాట్లాడుతూ… ఫిర్యాదులకు అధికారులు.. క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారులకు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు నాణ్యమైన పరిష్కారాలను అందించాలని సూచిస్తూ.. అనంతరం అర్జీదారుల నుండి వారు అర్జీలను స్వీకరించారు.
అందులో.. వి.ఎన్. పల్లె మండలం అడవి చెర్లోపల్లెకు చెందిన జే. పెద్ది సుబ్బన్న.. మండలంలోని కొమ్మద్ది పరిధిలో.. జిఎ.న్.ఎస్.ఎస్. కాలువల నిర్మాణం కోసం గ్రామ పొలాలు, బోర్లకు అవార్డు మంజూరైంది కానీ.. ఇంతవరకు పరిహారం అందివ్వలేదని కొరమర్పించాలని కోరుతూ.. జిల్లా స్పందనలో అర్జీ సమర్పించుకున్నారు.
అదేవిధంగా కడప పట్టణానికి చెందిన కోరా ఓబులమ్మ.. కడపాలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో మేనేజర్, ఏవో పోస్టు ఖాళీగా ఉమ్నాయని తనకు అవకాశం కల్పించాలని కోరుతూ జిల్లా స్పందనలో అర్జీ సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపివో వెంకట రావు, ఆర్ అండ్ బి ఎస్.ఈ. మహేశ్వర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాస రెడ్డి, డిఆర్డీఏ పీడి ఆనంద్ నాయక్, ఆర్ డఖ్ల్యూఎస్ ఎస్ఈ వీరన్న, జిల్లా వ్యవసాయ అధికారి జేడీ నాగేశ్వరరావు, హౌసింగ్, డ్వామా పీడిలు కృష్ణయ్య, యదుభూషన్ రెడ్డి, డిఎమ్ హెచ్ ఓ డా. నాగరాజు, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.రమాదేవి, ఎల్డిఎం దుర్గా ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.