కడప నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి రెడ్డప్ప గారి మాధవి
కడప అర్బన్
రామరాజ్యం కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కడప నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ రెడ్డప్ప గారి మాధవి సోమవారం 11వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ప్రజలకు ఆమె సూచించారు. ఇంటింటికి తిరిగి మహిళలకు టిడిపి మేనిఫెస్టో పథకాల కరపత్రాలను అందించి, వాటి లబ్ధిని తెలియపరచి, టిడిపి అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు అవుతాయని చెప్పారు. ఈ ప్రభుత్వ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, అభివృద్ధిని నిర్వీర్యం చేసి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధోగతి పాలు చేసిందని ఆమె మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు రాక పోరుగు రాష్ట్రాల్లో చాలి, చాలని జీవితాలకు పని చేస్తూ అష్ట కష్టాలు పడుతున్నారని, దానికి కారణం ప్రభుత్వం కాదా అని ఆమె నిలదీశారు. ప్రతి ఏడాది జాబు క్యాలెండర్ విడుదల చేసి యువతకు ఉద్యోగాలు ఇస్తామని జగన్ ప్రభుత్వం మోసం చేసింది యువత, నిరుద్యోగులు గుర్తు ఎరగాలని ప్రభుత్వ తీరును ఆమె గుర్తు చేశారు. టిడిపి అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని లోకేష్ యువతకు హామీ ఇచ్చారని ఆమె చెప్పారు. రాబోవు ఎన్నికల్లో చంద్రబాబుకు పట్టం కట్టాలని ఆమె అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు శివకొండారెడ్డి, పల్లా రాము డివిజన్ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.