ఏలేశ్వరం:
ప్రత్తిపాడు నియోజకవర్గం అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే, వైకాపా నియోజకవర్గ ఇన్చార్జ్ వరుపుల సుబ్బారావు తోనే సాధ్యమని నియోజకవర్గంలోని గ్రామాలకు చెందిన నాయకులు యువకులు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అత్యంత కీలకమైన ధర్మవరం, వొమ్మంగి, రాచ పల్లి,ప్రత్తిపాడు గ్రామాలకు చెందిన నాయకులు యువకులు లింగంపర్తి లోని వరుపులు స్వగృహంలో ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ సమక్షంలో వరుపుల ను కలిసి తమ మద్దతు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ధర్మవరం గ్రామం నుండి వరుపుల సుబ్బారావు స్వగ్రామం కు విచ్చేసిన పార్టీ శ్రేణులు, అభిమానులకు ఆహ్వానం పలికిన అనంత బాబు, ఈ సందర్భంగా అనంత బాబు మాట్లాడుతూ, ప్రత్తిపాడు మండలంలో అతి కీలకమైన గ్రామాలు ధర్మవరం, రాచపల్లి ఒమ్మంగి, ప్రత్తిపాడు, ఈ గ్రామాల నుండి అత్యంత మెజార్టీ తేవడానికి కృషి చేయాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు, అనంతరం పరుపులు సుబ్బారావు నాయకత్వంలో పనిచేయడానికి మేము అందరం కృషి చేస్తామని వరుపుల ను గెలిపించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మొదటి బహుమతిగా ఇవ్వాలని ధర్మవరం గ్రామస్తులు గట్టిగా తీర్మానించుకున్నామని తెలిపారు.
ప్రతిపాడు నియోజవర్గం వైకాపా ఇంచార్జ్ సుబ్బారావు మాట్లాడుతూ మీ అందరిని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉందని మన నియోజకవర్గంలోనే కీలకమైన గ్రామం ధర్మవరం అని మీ అందరి ఆశీస్సులతో ఆదర అభిమానులతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నాకు అవకాశం కల్పించారన్నారు. నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించాలని రానున్న ఎన్నికల్లో కష్టపడి పని చేస్తే ఫలితం దానంతట అదే వస్తుంది అని అత్యంత మెజార్టీతో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. అనంతరం మర్రివీడు గ్రామానికి చెందిన పల్లేల బ్రహ్మానందం ఆధ్వర్యంలో వరుపులకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో గంటేడి బాలసౌరి, గంటేడి బుజ్జి బాబు, వల్లూరి ప్రవీణ్, జి రవీంద్ర, విజయబాబు,జేమ్స్, అయినవిల్లి ఉదయ్ కిరణ్, మధు, ములగాడా పండు, వీరితో పాటు ఉభయగోదావరి జిల్లాల మాదిగ ఐక్యవేదిక జిల్లా మాజీ అధ్యక్షులు రాచర్ల రమేష్ ఉన్నారు.