Tuesday, April 22, 2025

Creating liberating content

తాజా వార్తలుపల్లె పల్లెకు బిజేపీ గడప గడప కు కమలం

పల్లె పల్లెకు బిజేపీ గడప గడప కు కమలం

బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్

వేంపల్లె
రానున్న ఎన్నికల సందర్బంగా పల్లె పల్లెకు బిజెపి గడపగడపకు కమలం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరి ప్రసాద్ తెలిపారు. సోమవారం వేంపల్లి బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 9,10,11 తేదీలలో పల్లెకు పోదాం బిజెపి కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దేశంలో ఉన్న బాధ్యత గల ప్రతి కార్యకర్త మూడు రోజులు వారికి కేటాయించిన గ్రామాలకు వెళ్లి పనిచేయాలని చెప్పారు నరేంద్రమోడీ గత పది సంవత్సరాల లో చేసిన అభివృద్ధి, వివిధ సంక్షేమ పధకాల గురించి ప్రతి ఇంటికివెల్లి వివరించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన వారిని కలిసి అభివృద్ధి సంక్షేమం గురించి వివరించాలని చెప్పారు. ప్రతి ఒక్కరికి మోడీ సందేశం వినిపించాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ని 3వ సారి గెలిపించి దేశాన్ని ముందుకు నడిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. గ్రామం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చేయాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వమే శరణ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ రామచంద్రా రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ తేరా మహేశ్వరరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు పి.సుస్మా, మండల శాఖ అధ్యక్షుడు ఎన్. సునీల్ కుమార్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం ప్రసాద్ రెడ్డి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి మునగల చంద్ర , మహేష్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article