Tuesday, April 22, 2025

Creating liberating content

తాజా వార్తలుఅభివృద్దేమాఅభిమతం:తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి..!

అభివృద్దేమాఅభిమతం:తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి..!

చంద్రగిరి మండలంలో రూ.1.15 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు
అంబరాన్నంటిన ప్రారంభోత్సవ వేడుకలు

చంద్రగిరి:
చంద్రగిరి మండలంలో రూ.1.15 కోట్లతో అభివృద్ధి పనులను తుడా చైర్మన్,చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సోమవారం ప్రారంభోత్సవాలు అంబరాన్నంటాయి. పనపాకం పంచాయతి లో 25 లక్షలతో నిర్మించిన పనపాకం సచివాలయం నుప్రారంభించారు,అనంతరం పనపాకం పంచాయతీ పాకాలవారిపల్లెలో 24లక్షలతో నిర్మించిన ప్రాథమిక పాఠశాలను ప్రారంబించారు. కల్ రోడ్డుపల్లి పంచాయతిలో 25లక్షలతో నిర్మించిన సచివాలయం ప్రారంభించారు. ఎం.కొంగరవారి పల్లిలో 40 లక్షలతో నిర్మించిన సచివాలయంను ప్రారంభించారు. సోమవారం పలు అభివృద్ధి పనులను తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి మాట్లాడుతూ:అభివృద్దే మా అభిమతంగా ప్రజల సౌకర్యార్థం.. పనపాకం పంచాయతీలో సచివాలయం భవనం, మండల ప్రాధమిక పాఠశాల భవనం, కల్ రోడ్డు పల్లిలో సచివాలయం భవనం, ఎం.కొంగరవారి పల్లిలో సచివాలయం భవనంను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాలు పల్లె ప్రజలకు అందుబాటులోకి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి, జెడ్పీటీసి యుగంధర్ రెడ్డి,వైఎస్ యంపిపి వెంకటరత్నం, ఐతేపల్లె డివిజన్ వైఎస్సార్ సిపి అధ్యక్షులు అగరాల దేవారెడ్డి,వరలక్ష్మి, జూపార్కు డైరెక్టర్ మణియాదవ్,పనపాకం అధ్యక్షులు పానేటి చెంగల్రాయులు,సిహెచ్ రెడ్డెప్ప,మస్తాన్, బుల్లెట్ చంద్రమౌళి రెడ్డి,పసల నాగరాజు,కసా గోపాల్, నాగభూషణం,అమాస నాగేశ్వరరావు,అజయ్ కుమార్,దూర్వాసులు,
శేఖర్,అమాసభాస్కర్,
పాకాలవారిపల్లె యస్,యం,సి.చైర్ పర్షన్ గౌతమి,సచివాలయం కార్యదర్శి శీరీష,కల్ రోడ్ పల్లె పంచాయతి అధ్యక్షులు రమేష్, పాండురంగనాయుడు,
మోహన్ నాయుడు, బాలాజీ,ముంగిపట్టు సర్పంచ్ భారతి, దామోదరనాయుడుతదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article