చంద్రగిరి:
చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపాన ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో
సోమవారం మండల టిడిపి అధ్యక్షుడు బోయపాటి నాగరాజునాయుడు, చిత్తూరు పార్లమెంట్ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ క్రమంలో టిడిపి నాయకులు కనకరాజు,ఈశ్వర్ చౌదరి,రావెళ్ల మోహన్,రమేష్ లు మాట్లాడుతూ మంగళవారం గంగాధర నెల్లూరులో తెలుగుదేశం పార్టీ రా కదలిరా కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విచ్చేయుచున్నారు.పాకాల మండలంలోని తెలుగుదేశం పార్టీ అభిమానులు,కార్యకర్తలు,నాయకులు పార్టీ మహిళలు,యువత భారీ ఎత్తున గంగాధర నెల్లూరుకు చేరుకొని రా కదిలి రా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.మండలంలోని పలు గ్రామాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అనంతనేని బాలాజీ,మోహన్,సురేష్,కుమార్ పాల్గొన్నారు.