చాలా మంది ఫేవరెట్ ఫుడ్ అయిన గోబి మంచూరియాపై నిషేధం విధించింది గోవాలోని ఓ పట్టణం! రెస్టారెంట్లే కాదు.. రోడ్డు పక్కన కనిపించే ఫుడ్ స్టాల్స్‌లో కూడా ఈ స్టార్టర్ డిష్‌ని అమ్మకూడదని తేల్చేసింది. గోవాలోని మపుసాలో గోబి మంచూరియాను అక్కడి అధికార యంత్రాంగం నిషేధించింది. గోబి మంచూరియా తయారీలో సింథెటిక్ కలర్స్ వాడుతున్నారన్న కారణంతోనే దానిపై నిషేధం విధించింది మపుసా మున్సిపల్ కౌన్సిల్. అయితే.. గోవాలో ఈ స్టార్టర్ డిష్‌ని నిషేధించడం ఇది తొలిసారి కాదు! 2022లో జరిగిన వాస్కో సప్తా ఫెయిర్ సమయంలోనూ ఇది నిషేధానికి గురైంది. అప్పుడు.. స్వయంగా, ఎఫ్‌డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్) నిషేధం విధించాలని సూచించింది. తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నారా? లేదా? అని తెలుసుకునేందుకు..ఎఫ్‌డీఏ రైడ్లు కూడా నిర్వహించింది ! ముంబైకి చెందిన దిగ్గజ చైనీస్ రెస్టారెంట్ నెల్సన్ వాంగ్.. దీనిని రూపొందించి, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాకు సర్వ్ చేసింది. ఏదైనా కొత్త డిష్‌ని తయారు చేయాలని ఛాలెంజ్‌గా తీసుకున్నారు నెల్సన్ వంగ్. స్పైసీ కార్న్‌ఫ్లోర్ బాటర్లో చికెన్ నగ్గెట్స్‌ని డీప్ ఫ్రె చేసి.. డ్రైగా లేదా సోయా సాస్, వెనిగర్, షుగర్‌తో తయారు చేసిన ట్యాంగీ గ్రేవీతో సర్వ్ చేశారు. అది బంపర్ హిట్ కొట్టింది. అది నాన్ వెజ్ ఫుడ్. వెజిటేరియన్స్‌కి కూడా అలాంటి రకమే ఒకటి ఉంటుందని భావించారు. అలా పుట్టుకొచ్చిందే ఈ గోబి మంచూరియా.