Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుబలపరీక్ష‌లో నెగ్గిన జార్ఖండ్ సిఎం చంపాయ్ సోరెన్

బలపరీక్ష‌లో నెగ్గిన జార్ఖండ్ సిఎం చంపాయ్ సోరెన్

47 మంది ఎమ్మెల్యేల మద్దతు

జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభానికి తెర పడింది. జార్ఖండ్‌ అసెంబ్లీలో జరిగిన అవిశ్వాస పరీక్షలో చంపై సోరెన్‌ సర్కార్ విజయం సాధించింది. చంపై ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు రాగా వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. దీంతో అవిశ్వాస పరీక్షలో జార్ఖండ్ సర్కార్ నెగ్గింది.

జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నెగ్గింది. చంపాయ్ సోరెన్‌కు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించగా, 29 మంది ప్రతిపక్షంలో ఉన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేల మద్దతుతో ఆయన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.జార్ఖండ్ అసెంబ్లీ స్పీకర్ రవీంద్రనాథ్ మహతో తీర్మానానికి అనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్న సభ్యులను ఒక్కొక్కరుగా తమ స్థానాల్లో నిలబడాలని కోరారు.”తీర్మానానికి అనుకూలంగా 47 ఓట్లు వచ్చాయి. తీర్మానానికి వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ సభ విశ్వాస పరీక్షకు ఆమోదం తెలిపింది’ అని స్పీకర్ సభను మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.
జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు భూకుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన తర్వాత ఫిబ్రవరి 2న రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా చంపాయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు.హేమంత్ సోరెన్ కూడా బలపరీక్షకు హాజరయ్యేందుకు అసెంబ్లీకి వచ్చారు. విశ్వాస పరీక్షలో పాల్గొనేందుకు సోరెన్‌కు రాంచీలోని ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. చర్చలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సమాజంలో గిరిజనులు, దళితులు అనేక విధాలుగా ఎదుర్కొంటున్న అణచివేతకు తన అరెస్టు ఒక ఉదాహరణ మాత్రమేనని అన్నారు.అంతకు ముందు జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం హేమంత్ సోరెన్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా ఒక సీఎంను రాత్రి వేళ అరెస్టు చేశారన్నారు. ఈ ఘటనలో రాజ్‌భవన్‌ పాత్ర కూడా ఉందని తాను నమ్ముతానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ దేశ చరిత్రలో జనవరి 31ని బ్లాక్​ డేగా సోరెన్ అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్ని నన్ను అరెస్ట్ చేసింది అని బల పరీక్ష సందర్భంగా అసెంబ్లీలో జరిగిన చర్చలో హేమంత్ సోరెన్ ఆరోపించారు.
జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ విశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభిస్తూ కేంద్రం ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న వ్యక్తి ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article