జీలుగుమిల్లి/ఏలూరు
జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన చింతమనేనిపై కేసు నమోదు చేయాలి.
ఏలూరు జిల్లాలోని చింతలపూడిలో ఈ నెల 5వ తేదీన జరిగిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సభ కవర్ చేసేందుకు వెళ్లిన
సీనియర్ జర్నలిస్టులు కెయస్. శంకర్రావు, రమణ రావుల సెల్ఫోన్లను లాక్కొని వారిపై దురుసుగా ప్రవర్తించిన దెందులూరు మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలి.
ఈనెల 5వ తేదీన చింతలపూడిలోని జరిగిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు రా కదిలి రా కార్యక్రమాన్ని తమ తమ సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై చింతమనేని ప్రభాకర్ అగ్రహం వ్యక్తం సరికాదు అంటున్నారు.
జర్నలిస్టులు తమ విధులు తాము నిర్వహిస్తున్నామని చెప్పినప్పటికీ వినకుండా వారి సెల్ ఫోన్ లు లాక్కుని ద్వంసం చేయడం దుర్మార్గపు చర్య అన్నారు.
దెందులూరులో తన ఇష్టారాజ్యంగా వ్యవహరాస్తున్నారని ఇప్పటికే పలు విమర్శలు ఎదుర్కోంటున్న దెందులూరు మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ చర్యలను ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు.
జర్నలిస్టులతోనూ అదే తీరుతో వ్యవహరించడం సరికాదు.
చింతమనేని ప్రభాకర్ పై ఐసీసీ 323, 394, 406, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి.
ఏపీయూడబ్ల్యూజే ఏలూరు జిల్లా అధ్యక్షులు కెపీకే.కిషోర్ డిమాండ్ చేశారు.
జర్నలిస్టులపై చింతమనేని ప్రవర్తనపై జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా, సామ్నా జిల్లా కమిటీ ల జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు.
చింతమనేనిని అరెస్ట్ చేయాలని లేని పక్షంలో దశల వారిగా ఉద్యమం చేపట్టాలని జర్నలిస్టులు నిర్ణయం.ఈ సమావేశంలో
ఏపీయూడబ్ల్యూజే ఏలూరు జిల్లా అధ్యక్షులు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు, మరియు, సామ్నా అధ్యక్ష కార్యదర్శులతో పాటు పలువురు జర్నలిస్టు పాల్గొన్నారు.
సీనియర్ జర్నలిస్టులపై దాడి అమానుషం
ఖండించిన ఏపీయూడబ్ల్యూజే
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం చింతలపూడిలో జరిగిన ‘రా కదలిరా!’ సభలో కవరేజ్ కి వెళ్ళిన ఇద్దరు సీనియర్ జర్నలిస్టులపై తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు దౌర్జన్యం చేయడాన్ని ఏపీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండించింది. మంగళవారం జంగారెడ్డిగూడెంలో జరిగిన సమావేశంలో ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు వాసా సత్యనారాయణ మాట్లాడుతూ రా కదలిరా పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న బహిరంగ సభ కవరేజ్ కి వెళ్ళిన జంగారెడ్డిగూడెంకు చెందిన సీనియర్ జర్నలిస్టులు కె.వి రమణారావు, కె.ఎస్. శంకరరావు లపై మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు దౌర్జన్యం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దౌర్జన్యం చేయడంతో పాటు సీనియర్ జర్నలిస్టుల సెల్ ఫోన్లు లాక్కుపోవడాన్ని, సెల్ ఫోన్లు ఇవ్వమని అడిగిన జర్నలిస్టుల పట్ల అనుచితంగా ప్రవర్తించడాన్ని యూనియన్ తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు. ఈ సంఘటనకు తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ, చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. దౌర్జన్యం ఘటనపై టీడీపీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జర్నలిస్టుల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరారు. పాత్రికేయులు వృత్తి ధర్మాన్ని నెరవేర్చుతున్న సమయంలో వారి పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎపీయుడబ్ల్యుజె రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డీ.వీ.భాస్కరరావు, జిల్లా కమిటీ సహాయ కార్యదర్శి కె.వెంకట్, జిల్లా కార్యవర్గ సభ్యులు కె.వి. రమణారావు, ఎం.గంగరాజు(ఎం.జి.ఆర్), ఎల్.వి.నాగాకుమార్ పాల్గొన్నారు.