గొల్లప్రోలు
గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో గత కొంతకాలంగా గ్రామం నడిబొడ్డున గల వాటర్ ట్యాంక్ సమీపంలోని చెట్టుపై అల బండలు తిష్ట వేసి తరచూ దాడులకు పాల్పడుతున్నాయి. స్థానిక కర్రి వారి వీధికి చెందిన చేదులూరి సత్యవేణి పై అలబండ దాడి చేసి చేతిపై బలంగా గాయం చేసింది. తీవ్ర గాయం కావడం తో ఆమె కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందారు. ఇప్పటివరకు సుమారు 40 మందిపై అల బండలు దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు విషయాన్ని కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాధ్ దృష్టి కి జడ్పీటీసీ వులవకాయల లోవరాజు తీసుకెళ్లారు. తక్షణం స్పందించిన ఎంపీ గీత జిల్లా ఫారెస్ట్ అధికారులు ను అప్రమత్తం చేశారు. అలబండలను పట్టుకుని, బాధితురాలికి న్యాయం చేయాలని ఆదేశించారు. బవురువాక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వై బాబురావు, ఎస్ అగ్రహారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పి లావణ్య, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఓరుగంటి సూర్యకుమారి చక్రి, వైస్సార్సీపీ నాయకులు ఓరుగంటి ప్రసాద్, బదిరెడ్డి కృష్ణ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి వివరాలు సేకరించారు. అధికారులు అలబండలను పట్టుకోవడానికి గ్రామం లో గాలింపు చేపట్టారు.