గొల్లప్రోలు
గొల్లప్రోలులోని సచివాలయాన్ని నగర పంచాయతీ కమీషనర్ రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం స్థానిక మార్కండేయపురం లోని సచివాలయం -4 ను కమీషనర్ సందర్శించి సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించారు. జగనన్న కాలనీ కి సంబంధించిన స్థలం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రిజిస్ట్రేషన్లు చేపట్టాలని సూచించారు. కమీషనర్ వెంట మేనేజర్ రామ్ ప్రసాద్, సచివాలయ సిబ్బంది స్వామి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.