తుని:
తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రతి నిరుపేద ఆర్థిక స్వావలంబన దిశగా ముందడుగు వేస్తారని తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ దివ్య అన్నారు. ఇవాళ తుని టౌన్ పరిధిలోని 7వ వార్డులో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడుతో కలిసి తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యనమల దివ్య బాబు ష్యూరిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. యనమల దివ్య యనమల కృష్ణుడు7వ వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు జననేత్రి యనమల దివ్య నుదుటన విజయ తిలకం దిద్ది మంగళహారతులతో విజయభవా అంటూ ఆశీర్వదించారు. అనంతరం తెలుగుదేశం జనసేన కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లిన యనమల దివ్య వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరో రెండు నెలలు తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని అప్పుడు ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వైకాపా హయాంలో గ్రామీణాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందని.. తెలుగుదేశం జనసేన పార్టీలను గెలిపిస్తే ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు మాట్లాడుతూ. వచ్చే ఎన్నికల్లో యనమల దివ్య గెలుపు ఖాయమన్నారు. వైకాపా నియంత్రణతో పాలనపై విసుగెత్తిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ దంతులూరి శ్రీనివాసరాజు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు పోల్నాటి శేషగిరిరావు ఎస్ఎల్ రాజు మోతుకూరి వెంకటేష్ యనమల శివరామకృష్ణ జనసేన సమన్వయకర్త చోడిశెట్టి గణేష్ ఈ కార్యక్రమంలో దంతులూరి శివరామకృష్ణరాజు, కుచ్చర్లపాటి వర్మ,పోలిశెట్టి రామలింగేశ్వర రావు, మల్ల గణేష్, రాంబాబు రాజు, అల్లు రాజు,పోతల రాంబాబు, దిబ్బ శ్రీను, చొప్పా సత్యనారాయణ,రంగాల గోవిందు,పూడి సత్యవేణి,మామిడి దాసు, పృధ్వీరాజ్, దమ్ములూరిసూరిబాబు, జట్ల శ్రీను, రెడ్ల సూరిబాబు,వాడపల్లి రాము తదితరులు పాల్గొన్నారు