గంటపాటు రైతుల సమస్యలపై చర్చించటానికి కూడా జగన్ ప్రభుత్వం ఒప్పుకోలేదు : బీ.టీ.నాయుడు
అమరావతి:సస్పెన్షన్ అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో టీడీపీ ఎమ్మెల్సీ బీ.టీ.నాయుడు మీడియాతో మాట్లాడుతూ..“ శాసనమండలిలో టీడీపీ సభ్యులు అందరం రైతుల సమస్యలపై చర్చకు పట్టుబట్టి, వాయిదా తీర్మానం ఇచ్చాం. కౌన్సిల్ ఛైర్మన్ మా తీర్మానాన్ని తిరస్క రించారు. కౌన్సిల్ లో బడ్జెట్ పై చర్చ 11 గంటలకు జరుగుతుంది కాబట్టి, 10 గంటల నుంచి రైతులసమస్యలపై చర్చించాలని తాము కోరితే ఛైర్మన్ కుదరదు అన్నారు. రైతుల సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం ఇష్టపడలేదు గానీ, సభా సమయాన్ని గంటలపాటు వృథా చేస్తోంది. దేశంలో అత్యధిక అప్పుల భారం ఉన్నది ఏపీ రైతులపైనే. ఒక్కో రైతు కుటుంబంపై రూ.2.45లక్షల అప్పు ఉంది. దేశంలో మరే రాష్ట్రంలో ఇంత భారీస్థాయిలో రైతులపై అప్పులు లేవు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్రంలో 4వేల మంది రైతులు చనిపో యారు. కారణం జగన్ రెడ్డి అతని ప్రభుత్వం అనుసరించిన రైతు వ్యతిరేక విధా నాలే. జగన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం రైతు ద్రోహులురైతు భరోసా కేంద్రాలు వైసీపీ కార్యకర్తలకు కల్పతరువుల్లా మారాయి. పోలవరం ప్రాజెక్ట్ పై నీటిపారుదల శాఖ మంత్రికి అవగాహన ఉండదు. వ్యవసాయం గురించి సదరు శాఖ మంత్రికి ఏమీ తెలియదు. పౌరసరఫరాల శాఖమంత్రికి ఖరీఫ్, రబీల్లో ఎంత ధాన్యం రైతుల నుంచి వస్తుంది.. ప్రభుత్వం ఎంత కొనాలనేది తెలియదు. ఇలాంటి మంత్రులు రైతాంగాన్ని, వ్యవసాయరంగాన్ని ఉద్ధరిస్తారా? జగన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం ముమ్మాటికీ రైతుద్రోహులనే చెప్పాలి.” అని బీటీ.నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.