Friday, November 29, 2024

Creating liberating content

టాప్ న్యూస్సినిమా కోసం సభను వాయిదా వేశారు: టీడీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం

సినిమా కోసం సభను వాయిదా వేశారు: టీడీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం

సినిమా కోసం సభను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ శాసనసభను బహిష్కరించి బయటకు వచ్చిన అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ ప్రభుత్వం 5ఏళ్లలో తీసుకొచ్చిన ప్రజాస్వామ్యవ్యతిరేక చీకటి జీవోల ప్రతులను దహనం చేసి మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యేలు .ఉభయసభలకు వెళ్లేముందు సచివాలయ అగ్నిమాపక కేంద్రం వద్ద ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.నిరసనలో భాగంగా ‘ఉపాధి లేక నిరుద్యోగుల ఆకలి కేకలు, రక్షణ లేక మహిళల ఆర్తనాదాలు’ అంటూ బ్యానర్లు ప్రదర్శించిన తెలుగుదేశం సభ్యులు.రాష్ట్రానికి వైసీపీప్రభుత్వ రూపంలో పట్టిన శని, దరిద్రం నేటితో వదిలిపోతోందని, ఐదేళ్లుగా ఇష్టానుసారం సాగించిన ప్రజావ్యతిరేక పాలన పరిసమాప్తి కానుందన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు.9 గంటలకు సభ ప్రారంభమవుతుందని చెప్పి, చివరకు సరిపడ సభ్యుల కోరం లేక సభను వాయిదా వేశారు. యాత్ర-2 సినిమా కోసం శాసనసభను వాయిదా వేయించడం జగన్ రెడ్డికే చెల్లింది కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ చివరి అసెంబ్లీ సమావేశాలను, బడ్జెట్ తతంగాన్ని వైసీపీప్రభుత్వం అపహాస్యం చేసింది. ఉదయం టీడీపీ చేసిన నిరసనలో ఈ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పు పట్టాము. శాసనసభ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. కానీ 9.15 ని.ల వరకు సభలో కోరం లేకపోవడంతో సభను వాయిదా వేశారు. నేడు యాత్ర-2 సినిమా విడుదల అవుతోందని చెప్పి జగన్ రెడ్డి కోరిక మేరకు స్పీకర్ సభను వాయిదా వేశారు. తిరిగి 11గంటలవరకు సభను సమావేశపరచ లేదు. అందుకే టీడీపీ శాసనసభా పక్షం ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ, సభ్యులందరం బయటకు రావడం జరిగింది.వైసీపీప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలన్నీ రాష్ట్ర వినాశనానికే దారి తీశాయి తప్ప ప్రజలకు మేలుకు, రాష్ట్రాభివృద్ధికి పనికిరాలేదన్నారు.చట్టసభల్లో చేసే చట్టాలు, రాష్ట్రాభివృద్ధికి..ప్రజలకు ఉపయోగపడేవిధంగా ఉండా లి. కానీ జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో వైసీపీప్రభుత్వం చేసిన చట్టాలన్నీ రాష్ట్ర వినా శనానికే దారి తీశాయి. పేదల బతుకులు బాగుచేయడం గురించి, సామాన్య ప్రజల జీవన స్థితిగతుల గురించి, మహిళలు..యువత..రైతుల సంక్షేమం గురించి ఒక్క చట్టం కూడా తీసుకురాలేదు. అందుకే బడ్జెట్ సమావేశాల చివరి రోజున ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజావ్యతిరేక చీకటి జీవోల ప్రతులను దహనం చేశాం.” అని అచ్చెన్నాయుడు తెలిపారు.

బూతులు తిట్టడం, దాడులుచేయడం, మహిళల గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కించపరచడం, ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కడం వంటి ప్రజాస్వామ్య విరుద్ధ ఘటనలకు వేదికగా నిలిచిన శాసనసభ సాక్షిగా జగన్ సర్కార్ తీసుకొచ్చిన చీకటి జీవోల ప్రతుల్ని దహనం చేశామని నిమ్మల రామానాయుడు అన్నారు.“ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు ప్రజాస్వామ్య చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ, విభజనానంతర రాష్ట్రంలోకానీ శాసనసభ జరిగిన తీరు ఒకెత్తు అయితే, 4 ఏళ్ల 10నెలల జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో జరిగింది ఒక ఎత్తు. జగన్ రెడ్డి పాలనలో శాసనసభ నిర్వహించిన రోజులన్నీ బ్లాక్ డేస్ అనే చెప్పాలి. నిండు సభ సాక్షిగా వైసీపీ సభ్యులతో, ప్రతిపక్షసభ్యులపై దాడులు చేయించింది ఈ సభలోనే. వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు బూతులతో ప్రతిపక్ష సభ్యులపై విరుచుకుపడింది ఈ సభలోనే. ప్రజాస్వామ్యంలో అధికారపక్షానికి, ప్రతి పక్షానికి సమాన అవకాశం ఇవ్వాల్సిన తరుణంలో ప్రతిపక్షసభ్యులు నోరెత్త కుండా వారి గొంతులు నొక్కేసింది ఈ సభలోనే. మహిళల ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని కించపరిచేలా జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ శాసనసభను కౌరవసభగా మార్చింది. ఇలాంటి అనేక దుశ్చర్యలకు, ప్రజాస్వామ్య హనన చర్యలకు వేదికగా నిలిచిన ఈ సభలో చేసిన అనేక ప్రజా వ్యతిరేక చట్టాలకు సంబంధించిన జీవోలను తగలబెట్టాం అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article