అమరావతి:టీడీపీ సభ్యులు దహనం చేసిన చీకటి జీవోల ప్రతులు ఏమిటంటే…!.. జీవో నెం : 2430 – (మీడియాస్వేచ్ఛపై ఆంక్షలు విధిస్తూ తీసుకొచ్చిన జీవో)
జీవో నెం : 217 – (మత్స్యకారుల గొంతులు కోస్తూ తీసుకొచ్చిన జీవో)
జీవో నెం : 159 – (రాజధాని అమరావతిని విచ్ఛిన్నం చేస్తూ మూడు రాజధానుల పేరుతో తీసుకొచ్చిన జీవో)
జీవో నెం : 98 – (చంద్రన్న పెళ్లికానుక, చంద్రన్న బీమా పథకాల రద్దు జీవో)
జీవో నెం : 99 – (చంద్రబాబు రైతుల్ని ఆదుకోవడానికి తీసుకొచ్చిన రైతు రుణమాఫీని రద్దుచేస్తూ ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో)
జీవో నెం : 96 – అన్నం పెట్టే అన్నదాతలను కులం, మతాల వారీగా వర్గీకరించి, కౌలు రైతుల నోట్లో మట్టికొట్టిన వైసీపీప్రభుత్వ జీవో)
జీవో నెం : 22 – (అన్నదాతలకు గతప్రభుత్వాలు అందించిన ఉచిత విద్యుత్ కు మంగళం పాడుతూ జగన్ రెడ్డి సర్కార్ రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన జీవో)
జీవో నెం : 464 – రైతులకు సున్నావడ్డీ రుణాలు చంద్రబాబు రూ.3లక్షల వరకు అందిస్తే, దాన్ని రూ.లక్షకుకుదిస్తూ జగన్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన జీవో)
జీవోనెం : 90 – మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి, మద్యాన్ని ప్రధాన ఆదాయవనరుగా ప్రకటించి మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయంతో అప్పులు తీసుకురావడానికి జారీ చేసిన జీవో)
జీవో నెం : 512 – (ప్రజల భూములకు రక్షణ లేకుండా జగన్ సర్కార్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ జీవో)
ఇలాంటి చీకటి జీవోలను ఈ ఐదేళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వం 240కు పైగా తీసుకొచ్చింది. రాష్ట్ర శాసనసభను జగన్ రెడ్డి కౌరవసభగా మార్చిన తీరుని నిరసిస్తూ వైసీపీప్రభుత్వ చీకటి జీవోలు దహనం చేయడం జరిగింది. జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో కౌరవసభగా మారిన శాసనసభ తిరిగి, చంద్రబాబు పవన్ కల్యాణ్ ల నాయకత్వంలో గౌరవసభగా మారాకే తిరిగి టీడీపీసభ్యులందరం సభలో అడుగుపెడతాం ” అని రామానాయుడు స్పష్టం చేశారు.
ప్రజల బాధలు, రాష్ట్రసమస్యల కంటే ముఖ్యమంత్రి..వైసీపీ సభ్యులకు సినిమాలే ముఖ్యమయ్యాయి : డోలా బాలవీరాంజనేయస్వామి
“ తెలుగు మహిళల్ని కించపరిచి, వారి ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని రోడ్డున పడేసిన ఈ శాసనసభ కార్యకలాపాలు నేటితో ముగిశాయి. సభలోని సభ్యులపై చరిత్రలో మొదటి సారి భౌతిక దాడులు జరిగింది ఈ సభలోనే. స్పీకర్ కు మైక్ ఇవ్వకుండా, సభానిర్వహణకు స్పీకర్ కు అధికారం లేకుండా చేసింది ఈ సభలోనే. చివరకు కోరం లేక ఆలస్యంగా సభ ప్రారంభమైంది కూడా ఇక్కడే. సభకు రాకుండా వైసీపీ సభ్యులు సినిమాలకు వెళ్లడాన్ని ఏమనాలి? ప్రజల బాధలు…రాష్ట్రసమస్యల కంటే ఈ ముఖ్యమంత్రికి, వైసీపీ సభ్యులకు సినిమాలే ముఖ్యమయ్యాయి. ఇంతకంటే దారుణం ఉంటుందా? ఇలాంటి నీతిమాలిన, ప్రజా వ్యతిరేక చర్యలకు.. ఘటనలకు సాక్షిగా నిలిచిన ఈ సభకు స్వస్తి చెబుతున్నం దుకు చాలా సంతోషిస్తున్నాం.” అని బాల వీరాంజనేయస్వామి తెలిపారు.