జైపూర్ వేదికగా జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా సెంచరీ నమోదు చేశాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పూజారా సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టు కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర జట్టుకు ఓపెనర్లుకు మంచి అరంభం లభించలేదు . ఓపెనర్లు కెవిన్ (0), హార్విక్ దేశాయ్ (21) తొందరగానే ఔటవగా, ఆ తర్వాత విశ్వరాజ్ జడేజా 22 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. పుజారా షెల్డన్ జాక్సన్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 230 బంతులు ఎదుర్కొన్న ఛెతేశ్వర్ పుజారా 9 ఫోర్లతో 110 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో బరిలోకి దిగిన టీమిండియా స్టార్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నిలకడగా బ్యాటింగ్ చేస్తూ.. జట్టును తొలి షాక్ నుంచి గట్టెక్కించాడు.ఇక ఈ శతకంతో.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఛేతేశ్వర్ పుజారాకి ఇది 62వ సెంచరీ కావడం గమనార్హం. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారతీయుడిగా 3వ స్థానంలో నిలిచాడు. 68 సెంచరీలు చేసిన ద్రవిడ్ 2వ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ జాబితాలో 62వ సెంచరీతో పుజారా 3వ స్థానానికి చేరుకున్నాడు.ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్స్ సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ అగ్రస్థానంలో ఉన్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సచిన్, సునీల్ గవాస్కర్ 81 సెంచరీలు చేశారు.