నియోజకవర్గ కన్వీనర్ విజయ్ రాజు
కామవరపుకోట
ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయాలని అందుకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయ రాజు అన్నారు.
ఈరోజు కామవరపుకోట మండలంలో నిర్వహించిన వాలంటీర్లతో ఆత్మీయ సమావేశంలో ముఖ్యఅతిధిగా నియోజకవర్గం సమన్వయకర్త కంభం విజయరాజు పాల్గొన్నారు . ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి యావత్ దేశం గర్వించేలా వాలంటీర్ వ్యవస్థను రూపొందించారని, సంక్షేమాన్ని నేరుగా పేదలకు అందిస్తోన్న ఈ అద్భుత వ్యవస్థ ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఉందని, ఇలాంటి గొప్ప పాలన ఇలాగే కొనసాగాలంటే మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావాలని పిలుపు ఇచ్చారు.
ఈ కార్యక్రమములో ముఖ్యనాయకులు చింతలపూడి మాజీ ఏఎంసి చైర్మన్ మేడవరపు అశోక్ బాబు , మండల ఎంపీపీ మేడవరపు విజయలక్ష్మి , మండల జడ్పీటీసీ కడిమి రమేష్ , పార్టీ మండల అధ్యక్షులు మిడతా రమేష్ , సర్పంచ్ కొత్తూరి అనూష భాగ్యరాజు , మండలం సోషల్ మీడియా విభాగం మరియు ఎంపీటీసీ లు, వార్డ్ మెంబెర్స్, పార్టీ సీనియర్ నియోజకవర్గ మరియు మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.