Sunday, April 20, 2025

Creating liberating content

క్రీడలుమన ప్రవర్తనతోనే గౌరవాన్ని సంపాదించుకోవాలి: ధోనీ

మన ప్రవర్తనతోనే గౌరవాన్ని సంపాదించుకోవాలి: ధోనీ

ముంబైలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ మాట్లాడుతూ… గౌరవం అనేది ఉన్నత పదవిలో ఉన్నంత మాత్రాన రాదని… మన ప్రవర్తనతోనే దాన్ని సంపాదించుకోవాలని టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ చెప్పాడు. గౌరవాన్ని సంపాదించుకోవడం చాలా ముఖ్యమని.. లేకపోతే డ్రెస్సింగ్ రూమ్ లో సహచరులు, సహాయ సిబ్బంది మన పట్ల విధేయతతో ఉండరని చెప్పారు. మన ప్రవర్తనే మనకు గౌరవాన్ని తెచ్చి పెడుతుందని అన్నాడు. గౌరవం అనేది దానంతట అదే రాదని… మనం సంపాదించుకోవాలని చెప్పాడు.మాటలు చెప్పడం వల్ల ఉపయోగం ఉండదని… చేతల్లో చూపిస్తేనే సహచరుల నమ్మకం పొందగలమని అన్నాడు. మన సహచరులు మనల్ని నమ్మితే మెరుగైన ప్రదర్శన దానంతట అదే వస్తుందని తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article