ఎమ్మెల్యే అభ్యర్థిమా రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
పులివెందుల టౌన్
రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం టిడిపి తోనే సాధ్యమని పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బిటెక్ రవి) అన్నారు . ఆదివారం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ఎర్రగుడి పల్లె లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బీటెక్ రవితో అడుగేద్దాం కార్యక్రమంలో భాగంగా బీటెక్ రవి టీడీపీ -జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి తిరిగి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా పాలనలో అవినీతి,దౌర్జన్యం, అక్రమాలు తప్ప అభివృద్ధి శూన్యం అన్నారు రాష్ట్రం బాగుపడాలంటే ఒక చంద్రబాబునాయుడు తోనే సాధ్యమన్నారు .ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమస్యలను పట్టించుకోని జగన్ రాష్ట్రంలోని ప్రజల సమస్యలను ఏం పట్టించుకుంటాడు అని అయన ఆన్నారు .రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షుడు బ్రాహ్మణపల్లి వెంకటరామిరెడ్డి, మహబూబ్ బాషా, కాశీం తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.