వేలేరుపాడులో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తపన చౌదరి పర్యటన,
వేలేరుపాడు,
బీజేపీ పల్లె నిద్రలో భాగంగా తపన ఫౌండేషన్,బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆదివారం వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు.
మండలంలోని భూదేవిపేట గ్రామంలో ఉన్న చాముండేశ్వరి ఆలయం మరియు శివాలయం ఆలయాలను సందర్శించినారు. ఆలయాల అభివృద్ధి కి తపన ఫౌండేషన్ తరుపున సహరిస్తామని తెలిపారు.బీజేపీ ప్రభుత్వం హిందూ దేవాలయాల అభివృద్ధి కి పెద్ద పీఠ వేయడం జరిగింది అని అన్నారు. మండలంలోని సీనియర్ పాత్రికేయులు అయినా తుమ్మల నాగేశ్వరావు ను మాచర్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కలిసి వారి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు అయినా ములకలపల్లి నరసింహరావు గ్రామం రుద్రంకోట గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, దేశాన్ని ప్రగతి పదంలో నడుపుతున్న వ్యక్తి మోడీ అని కేంద్ర ప్రభుత్వ పధకాలపై ప్రజలకు వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నది అని అన్నారు.నిర్వసితుల సమస్యలను కేంద్రం ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్తాన్నని తెలపడం జరిగింది. అదేవిదంగా పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రభావం వలన నీరు కలుషితం అవుతున్నదని ,ప్రతి రోజు నీళ్లు కొనుక్కొని త్రాగడం జరుగుతుందని గ్రామస్థులు చెప్పడంతో, తపన ఫౌండేషన్ తరుపున వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తామని అన్నారు.2024 లో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి అని అన్నారు. ఇ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జట్ల రాంబాబు, బీజేపీ ఎస్టీ మోర్చా మొడియం శ్రీనివాస్, తపన ఫౌండేషన్ సభ్యులు కుంజా వెంకట నర్సయ్య, బోద్దుల శివరాం, సారే బాబ్జి, తదితరులు పాల్గొన్నారు.