Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుఘనంగా శ్రీ వాసవి మాతా ఆత్మార్పణ దినోత్సవం

ఘనంగా శ్రీ వాసవి మాతా ఆత్మార్పణ దినోత్సవం

వేంపల్లె
స్థానిక పట్టణంలోని 119 సంవత్సరాలు చరిత్ర గల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో వైశ్య కులదేవత శ్రీ వాసవి మాతా ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా నిర్వహించామని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాయవరం సురేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయ అర్చకులు ఇంద్రకంటి ప్రసాద్ శర్మ నేతృత్వంలో
వాసవి మాతకు 102 కలశాలతో పాలాభిషేకం, గణపతి పూజా పుణ్యావచనం, తదితర విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాసవి మాతా ఉదయం విశేష అలంకారంలో, రాత్రి విశ్వరూప దర్శనంలో దర్శనమిచ్చారని తెలిపారు. అనంతరం ఇంద్రకంటి ప్రసాద్ శర్మ అర్చక శిష్య బృందం నేతృత్వంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాయవరం సురేంద్ర దంపతులచే చండీహోమం నిర్వహించారు. అమ్మవారిశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అగ్ని గుండంలో అధిక సంఖ్యలలో (అనగా నిప్పులపై) నడిచారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాయవరం సురేంద్ర మాట్లాడుతూ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు, మత విశ్వాసాన్ని నిలిపినందుకు , స్త్రీల ఆత్మ గౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయిందని తెలిపారు. వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపించినందుకు గాను వాసవి మాతా ఎప్పటికి అజరామరం అయిందన్నారు. ప్రాపంచిక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనసులలో ఒక విజేతగా , శాంతికి చిహ్నంగా ఎప్పటికి నిలిచిపోతుందని తెలిపారు.
అనంతరం తీర్థ ప్రసాదాలు వినియోగం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, శ్రీ వాసవి కళ్యాణ మండపం, అవోపా,అవోపా మహిళా విభాగం, ఆర్యవైశ్య మహిళా మండలి కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article