ఊయల అనుకొని ఓ తల్లి తన నెల రోజుల కూతురును ఓవెన్ లో పడుకోబెట్టింది. ఊపిరి ఆడక, కాలిన గాయాలతో ఆ చిన్నారి మరణించింది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.ఈ ఘటన అమెరికాలోని మిస్సోరీ కాన్సాస్ సిటీలో జరిగింది.కాన్సాస్ సిటీలో నివాసం ఉండే మరియా థామస్ అనే మహిళకు నెల రోజుల క్రితం కూతురు జన్మించింది. అయితే ఆ చిన్నారిని నిద్ర పుచ్చేందుకు ఆమె ప్రయత్నించింది. ఈ క్రమంలో ఊయల అనుకొని ఓవెన్ లో పడుకోబెట్టింది. కొంత సమయం తరువాత వచ్చి చూస్తే చిన్నారికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో కంగారు పడిన ఆమె వెంటనే 911కు కాల్ చేసింది.అధికారులు వచ్చి చూడగా కాలిన గాయాలతో ఉన్న శిశువును గుర్తించారు. దీంతో ఈ విషయాన్ని వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిన్నారిని నిద్ర పుచ్చేందుకు ప్రయత్నిస్తూ పొరపాటున ఊయలకు బదులు ఓవెన్ లో పెట్టానని ఆమె పోలీసులకు వివరణ ఇచ్చింది. ఘటనాస్థలిపై స్పందించిన కాన్సాస్ సిటీ అగ్నిమాపక శాఖ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రకటించింది.ఈ కేసులో నేరం రుజువు అయితే ఆమెకు కనిష్ఠంగా పదేళ్లు, గరిష్ఠంగా జీవిత ఖైదు విధిస్తారు.