భక్తులకు అన్నదానం
పులివెందుల టౌన్ పులివెందుల పట్టణంలోని అలవలపాడు రోడ్డులోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కళ్యాణోత్సవం, మహా కుంభ నివేదన కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ గూడూరు గురు ప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు మఠం బసవరాజు స్వామి, మఠం రుద్రా స్వామి లు శ్రీ వీరభద్ర స్వామికి పంచామృత సుగంధ ద్రవ్య సహిత మహా రుద్రాభిషేకం, విశేష అలంకరణతో ప్రత్యేక పూజలు చేసి అనంతరం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కళ్యాణోత్సవాన్ని శాస్రోత్సాహంగా నిర్వహించారు.
అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వేశాదరణ, కాంతార వేషధారణ, ముత్తైదువులు కలశముల చేత పట్టి స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. నేడు స్వామివారికి మహా కుంభ నివేదన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ గూడూరు ప్రసాద్ తెలిపారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకోవాలని ఆయన కోరారు