చంద్రగిరి
మండల పరిధిలోని ఏ. రంగంపేట నందు మోహన్ బాబు యూనివర్సిటీ లోని దాసరిఆడిటోరియంలో
పారా మెడికల్ కాలేజీ విద్యార్థులకు బేసిక్ లైఫ్ సపోర్ట్ అనే అంశంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని పారామెడికల్ విభాగాధిపతి డాక్టర్ మానస్ చక్రవర్తి ఆధ్వర్యంలో, ఎంబియు రిజిస్టర్ డాక్టర్ సారధి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమరాన్ హాస్పిటల్ ఎమర్జెన్సీ విభాగాధిపతి డాక్టర్ శివరామ కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ దైనందిన జీవితంలో మనిషికి అనుకోకుండా శ్వాస ఇబ్బంది, కళ్ళు తిరగడం, బ్లడ్ ప్రెషర్ పెరగడం, లేదా తగ్గడం, వీటన్నిటి వలన గుండె సమస్య ఏర్పడి నప్పుడు మనిషి ఎలా కాపాడుకోవాలో తెలియజేశారు. అలాజరిగిన వ్యక్తికి గుండె ఆదమడం, నోటిలో నోరు పెట్టి ఊదడం ద్వారా ప్రాణాలనుకాపాడవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీ విభాగాధిపతి డాక్టర్ చంద్రకళాధర్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.