వైసీపీ నుంచి టీడీపీకి జోరందుకుంటున్న వలసలు
ఊపు మీదున్న ఉగ్ర నరసింహారెడ్డి
కదిరి కట్టవేయాలని చూసినా వాగై పారుతున్న వలసలు
తాడోపేడో తేలేదాకా తాడేపల్లి వీడని బుర్రా
హనుమంతునిపాడు
కనిగిరి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు జోరందుకున్నాయి. మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆరు మండలాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ అందివచ్చిన అవకాశాలను అద్భుతంగా ఉపయోగించుకొని వైసీపీ కార్యకర్తలను టీడీపీలోకి చేర్చుకుంటున్నారు. వైసీపీలో స్థానిక ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కు ఇంచార్జ్ రానిలోటు స్పష్టంగా కనిపిస్తోంది అని బుర్రా వర్గీయులు తెలుపుచున్నారు. తాడోపేడో తేల్చుకొని తాడేపల్లి నుంచి వస్తానని తెలిపినట్లు స్థానిక శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ వర్గీయులు చర్చించుకుంటున్నారు.బుర్రా మధుసూదన్ యాదవ్ వైసీపీ ఇంచార్జ్ అయితే ఇలా వలసలు కొనసాగేవి కాదంటున్నారు. పది సంవత్సరాలపాటు ప్రజలతో మమేకమై 5 సంవత్సరాలు ప్రతిపక్షమైన 5 సంవత్సరాలు పాలక పక్షమైనా ప్రజాలపక్షాన నిలిచారన్నారు. కనిగిరి కాటంరాజు బుర్రా మధుసూదన్ యాదవ్ అని ఆయన అయితేనే కనిగిరి కొండపైన వైసీపీ జెండా ఎగురుతుందని బుర్రా వర్గీయులు తెలిపారు.
మాజీ శాసనసభ్యులు కదిరి బాబురావు దద్దాల ఇంచార్జ్ మాత్రమే అభ్యర్థి కాదని ఇప్పుడే పార్టీ మారవద్దు వేచిచూడాలని కార్యకర్తలకు చెప్పినప్పటికీ వలసలు ఆగకపోవటం గమనార్హం. హనుమంతునిపాడు మండలంలో వైసీపీ ఇంచార్జ్ సామాజిక వర్గానికి చెందిన నాయకులు మహ్మదాపురం మాజీ సర్పంచ్ చింతం వెంకట కొండయ్య వేములపాడు మాజీ సర్పంచ్ జెట్టిబోయిన వెంకటేశ్వర్లు దాసరిపల్లి ఆవులయ్య ఇలా ముఖ్యనాయకులు హనుమంతునిపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతి రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డిని కలిసి తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమంతునిపాడు ఎప్పుడు కాంగ్రెస్ వైకాపా కంచుకోట అని ఈ సారి కోటకు బీటలు వారినట్లు తెలిపారు. ఉగ్ర నరసింహారెడ్డికి భారీ మెజారిటీ వచ్చేందుకు శాయశక్తులా కృషిచేస్తామని తెలిపారు. ఇలానే వలసలు కొనసాగితే ఉగ్ర గెలుపు నల్లేరుపై నడకేనని అన్నారు.