జీలుగుమిల్లి
కేంద్ర ప్రభుత్వం మోడీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన గ్రామీణ బంద్ జీలుగుమిల్లి మండల కేంద్రంలో విజయవంతమైంది. ఉదయం 7 గంటలకే వామపక్ష పార్టీ కార్యకర్తలు రైతాంగ కార్మిక కౌలు రైతు మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఉదయం 6 గంటల నుంచి బందు ప్రశాంతంగా కొనసాగింది.ఉదయం 10 గంటల నుంచి బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలు సచివాలయాలు పాఠశాలలు విద్యాసంస్థలు మూతపడ్డాయి. జీలమిల్లి జగదాంబ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం గ్రామాల ప్రదర్శన నిర్వహించారు. సమస్యలు వినతి పత్రాన్ని డిప్యూటీ తహసిల్దార్ కు అందజేశారు. అనంతరం జరిగిన సభకు సిపిఎం మండల కమిటీ సభ్యులు ఎన్ వి అప్పారావు అధ్యక్షత వహించారు.సభలో సిపిఎం మండల కార్యదర్శి తెల్లం దుర్గారావు మాట్లాడుతూ రైతాంగానికి ఇచ్చిన హామీలు మోడీ మోసం చేశాడని తీవ్రంగా విమర్శించారు. రైతాంగం తరలి వెళ్లి నిరసన తెలిపేందుకు ప్రయత్నం చేస్తుంటే రోడ్లపై మేకులు కొట్టించటం సిగ్గు సెట్ అన్నారు.
మోడీ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేసి నల్ల చట్టాలు వెంటనే రద్దు చేయాలని రైతాంగం పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. న్యూ డెమోక్రసీ నాయకులు పెట్టి సుబ్బన్న మాట్లాడుతూ దేశంలో 80% గా ఉన్న ప్రజా సమస్యల పక్కకి నెట్టి మతం పేరుతో మోడీ ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. కార్మిక చట్టాలను రైతాంగ చట్టాలను వ్యవసాయ కారం చట్టాలను నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మేస్తూ ఈ దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని మోడీ నిలదీశారు. మోడీ తీరు మారకపోతే రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి చిట్టి బొమ్మ కొండలరావు,రైతు సంఘం మండల కార్యదర్శి సిరిబత్తుల సీతారామయ్య,వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి రాజమండ్రి దానియేలు, సిపిఐ పిడిఎస్యు రాష్ట్ర నాయకులు భూషణం, మండల సమితి కార్యదర్శి కొప్పుల నాగరాజు, శ్రీనివాసు, సిపిఐ ఎంఎల్ ప్రజాపంద నాయకులు కటకం ముత్యాలరావు కారం రామయ్య,న్యూ డెమోక్రసీ నాయకులు కట్నం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.