హిందూపురం టౌన్
నిత్యం యోగాను అభ్యసనం చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండవచ్చని భక్తుల పేర్కొన్నారు.
రథసప్తమి సందర్భంగా వివేకానంద యోగ కేంద్రము ఆధ్వర్యంలో 108 సూర్య నమస్కారాల కార్యక్రమం జరిగింది. సుమారు 300 మంది పైగా పాల్గొని ఆసనాలు వేశారు. కార్యక్రమంలో పాల్గొన్న నాగభూషణం మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో మానవాళికి అవసరమైన సంపూర్ణ ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను జీవిత విలువలను వంశపారంపర్యంగా కాపాడుకోవాలని, అందుకోసం యోగ విద్యను అభ్యసించాలన్నారు. ప్రపంచ ఆరోగ్య సంఊ చెప్పిన విధంగా ఆరోగ్యం అనగా మానసిక, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే సంపూర్ణ ఆరోగ్యం అవుతుందని ఇందుకోసం యోగ బాగా తోడ్పడుతుందని తెలిపారు. వివేకానంద యోగా కేంద్ర ఉపాధ్యక్షులు వెంకటేష్ బాబు మాట్లాడుతూ , పూర్వం నుండి నేటి వరకు సమస్త జీవరాశి సూర్యుని వల్లే మనుగడ సాగిస్తున్నాయని తెలిపారు. ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయడం వల్ల ప్రత్యక్షంగా,పరోక్షంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని, రథసప్తమి రోజున వివేకానంద యోగా కేంద్రము నందు 108 సూర్య నమస్కారములు చేయుటకు ఆనవాయితీగా తెలిపారు. అనంతరం అందరికీ ప్రసాద వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో కరే రమేష్, సదానంద, వెంకటేష్ దేవంగం శంకరప్ప, మహేంద్ర, రాజేశ్వరి, భారతి యెగ సాధకులు పాల్గొన్నారు.