- 18న ముఖ్యమంత్రి రాప్తాడు పర్యటన
- ఎయిర్పోర్ట్ లో పట్టిష్టమైన చర్యలు చేపట్టాలి
- జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
అనంతపురము బ్యూరో,(పుట్టపర్తి)
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన రెడ్డి ఈనెల 18న అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పుట్టపర్తికి రానున్నారని, ఈ సందర్భంగా ఇక్కడి ఎయిర్ పోర్టులో ఎలాంటి భద్రత లోపాలు రాకూడదని
శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అదేశించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాని అన్నారు. శుక్రవారం ఎస్పీ మాధవరెడ్డి తో కలిసి,జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు పుట్టపర్తిలో ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందితో ఎయిర్ పోర్ట్ లో ఏఎస్ఎల్ నిర్వహించారు. ఎయిర్ పోర్టు పటిష్టమైన భద్రత కలిగి ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎయిర్ పోర్ట్ నందు అంబులెన్సులు సిద్ధంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారినిజిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా పంచాయతీ అధికారిని, పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. విమానాశ్రయంనందు బారికెట్లు పటిష్టంగా ఉండాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు, పుట్టపర్తి విమానాశ్రయములో వీఐపీ లాంచ్ సుందరంగా తీర్చిదిద్దాలని ఎమ్మార్వోను ఆదేశించారు.
సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా..
సీఎం వైయస్.జగన్మోహన్ రెడ్డి ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ- గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో బయలుదేరి పుట్టపర్తి విమానాశ్రయానికి మధ్యాహ్నం 2.45 గంటలకు చేరుకుంటారని జిల్లా కలెక్టర్ తెలిపారు. అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో 2.45 గంటలకు బయలుదేరి అనంతపురం జిల్లాలోని రాప్తాడుకు బయలుదేరి వెళ్తారని, సాయంత్రం సమయంలో రాప్తాడు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం 5.35 నిమిషాలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారని తెలిపారు. అనంతరం అక్కడి నుండి సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వేణుగోపాల్, ఎంపీడీవో వై. నాగేశ్వర్ రెడ్డి, పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ ఎం.అంజయ్య, ఫైర్ ఆఫీసర్ హేమనాథరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కే. సహదేవ, ఆర్ అండ్ బి అధికారి సంజీవ, జిల్లా వైద్య శాఖ అధికారి ఎస్వీ కృష్ణారెడ్డి, డి సి హెచ్ ఓ తిపేంద్ర నాయక్, విద్యుత్ శాఖ అధికారి మోసెస్, డీఎస్పీ వాసుదేవన్, ఎయిర్ పోర్ట్ అధికారులు సాయినాథ్, లక్ష్మీనారాయణ ఇంటెలిజెన్స్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.