బలిజలు ఆయన వారసత్వాన్ని, కీర్తిని కొనసాగించాలి ఏపీఎస్ఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుల రాఘవేంద్ర
- అనంతపురము
- విజయనగర సామ్రాజ్య అధినేత, ఆంధ్ర భోజుడు, చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు
- 553వ జయంతిని శుక్రవారం నగరంలో బలిజ కాపు యువత, ఏపీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్ధానిక
- నడిమివంక దగ్గర ఉన్న శ్రీకృష్ణదేవరాయ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బలిజ కాపు యువత రాష్ట్ర నాయకులు, ఏపీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆకుల రాఘవేంద్ర మాట్లాడుతూ,
- చెరువులు, తటాకములు తవ్వించి కరువు నేలను సస్యశ్యామలం చేసిన గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలని కొనియాడారు. పాలనలో ప్రజల మన్ననలతో సత్కరింపబడ్డారని, “దేశభాషలందు తెలుగు లెస్స” అని మన మాతృభాష వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పి, తన రాజ్యంలో అష్ట దిగ్గజాలైన మహాకవులను పోషించిన గొప్ప కవి, మహారాజు అని కొనియాడారు. తన పరిపాలన కాలంలో నడి బజార్లలో వజ్రవైడూర్యాలు రాశులు పోసి అమ్మారని, ఆయన పరిపాలన కాలం ఒక స్వర్ణ యుగమని , కన్యాకుమారి నుంచి కోణార్క్ వరకు ప్రతి దేవాలయాన్ని ఆయన కాలంలో ఎంతో అభివృద్ధి చేసి దేశ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడారని, ఈ దేశ చరిత్ర ఉన్నంతవరకు శ్రీకృష్ణదేవరాయలను గుర్తుపెట్టుకుంటారని ప్రశంసించారు. బలిజ యువత, బలిజలు ఆయన స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎఫ్ నగర అధ్యక్షులు గురుసాయి, కార్యదర్శి శివ, అనిల్, ప్రచార కార్యదర్శి రమేష్ , గురు శివ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.