వి.ఆర్.పురం
రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలక్షన్లకు నేను సిద్ధం అని పిలుపు ఇచ్చి యున్నారు కదా !, దేనికి మీరు సిద్ధం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను మోసం చేసినందుకా, అని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి విమర్శించారు. తెలుగుదేశం పార్టీ మండల కార్యకర్తల సమావేశం శనివారం మండల అధ్యక్షులు ఆచంట శ్రీనివాస్ సమక్షంలో జరిగింది. ఈ సమావేశంలో నియోజక వర్గ ఇన్చార్జి వంతల రాజేశ్వరీ పాల్గొని మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు బాబు షూరిటీ కార్యక్రమం మరియు కుటుంబ సాధికారత కమిటీ గురించి మరియు ఓటర్ వెరిఫికేషన్ కు సంబంధించినవి ప్రతి ఒక్కటి త్వరగా చేయాలని అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలక్షన్లకు నేను సిద్ధం అని అంటున్నారు కదా! దేనికి మీరు సిద్ధం, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు లక్ష 15 వేల రూపాయలు ఇచ్చిన వాటికి నేను అధికారంలో వచ్చిన వెంటనే ఐదు లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి మాట తప్పిన వాటికి సిద్ధమా !, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పది లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి మాట తప్పిన దానికి సిద్దమా!, గత తెలుగుదేశం పార్టీ హాయంలో నిర్వాసితులకు నిర్మించిన కాలనీలను ఈరోజు వరకు కూడా నిర్వాసితులకు ఇవ్వకుండా మళ్లీ మాయ మాటలు చెప్పి నిర్వాసితులను మోసo చేస్తున్నందుకు సిద్ధమా ! అని రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. దానికి దీటుగా నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు, వి ఆర్ పురం మండలం తెలుగు దేశం పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు అందరు కుడా సంసిద్ధంగా సైనికులుగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బురక కన్నా రావు, జెడ్పీటీసీ వాళ్ళ రంగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ ముత్యాల రామారావు, ఎటపాక మండల అధ్యక్షులు పుట్టి రమేష్ , తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆకోజు భాగ్యలక్ష్మి, ఐటీడీపీ కన్వీనర్ ముత్యాలసిద్దు, రాష్ట్ర బిసి సెల్ అధ్యక్షులు నగేష్, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి చందు, నియోజకవర్గం వాణిజ విభాగ అధ్యక్షులు బీరక సూర్య ప్రకాష్ రావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ కార్యదర్శి అచ్చి రాజ్, మండల ట్రెజరీ పెందుర్తి సుదర్శన్ రావు, మండల ఆర్గనైజింగ్ కార్యదర్శిలు బురక సారయ్య కారం సిరమయ్య, యూనిట్ ఇన్ సర్చ్ ముత్యాల చంద్రశేఖర్, బూత్ కన్వీనర్ రేవు సింహాచలం, తెలుగు మహిళ కార్యదర్శి వెంకమ్మ , పోడియం సావిత్రి, మైనార్టీ సెల్ కార్యదర్శి పులి సాహెబ్ , ముత్యాల శంకర్ రావు, బోధిబోయిన సురేష్ రావు, కుంజం బాపన దొర, తదితరులు పాల్గొన్నారు.