Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుప్రతి సభ్యుడు ఒక యుద్ధ సైనికుడిలా పని చేయాలి

ప్రతి సభ్యుడు ఒక యుద్ధ సైనికుడిలా పని చేయాలి

ఎమ్మెల్యే అభ్యర్థి ఉరుకూటి చంద్ర రావు గెలుపే లక్ష్యంగా పాదయాత్ర

గాజువాక:
రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీకి చెందిన ప్రతి కుటుంబ సభ్యుడు ఒక యుద్ధ సైనికుడిలా పని చేయాలని గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఉరుకూటి రామచంద్రరావు (చందు ) పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. జీవీఎంసీ పరిధి పెదగంట్యాడ నడుపూరు గ్రామంలో 76వ వార్డు పరిధి నడుపూరు పైడితల్లమ్మ గుడి నుండి ఆ వార్డు ఇంచార్జ్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిం చారు.

అదివారం జరిగిన ఈ పాదయాత్రకు ఉరుకూటి రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని నడుపూరు ప్రాంతంలో ఉన్న పైడితల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన ఈ ఐదేళ్లలో రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి మంచి సుపరిపాలన అందించారన్నారు. రాష్ట్రంలో జగనన్న సంక్షేమ పథకాలు పొందిన ప్రతి ఒక్కరు జగనన్న పక్షాన నిలబడతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మన ఈ నియోజకవర్గ నుండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం తనకు అవకాశం ఇచ్చిందని ప్రజలందరూ తనని కూడా ఆశీర్వదించి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తారని నియోజకవర్గ ప్రజలందరిని ప్రార్థిస్తున్నానన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మంత్రి రాజశేఖర్, ఉరుకుటి అప్పారావు, తాటికొండ అచ్యుత్, ఓ.కొండయ్య,దేనిసెట్టీ చిన్నారావు, గాలి బాబురావు, అండిబోయిన సన్ని, కక్కుళ్ళ మురళి, నాయుడు సుధాకర్,ములకలపల్లి ప్రసాద్,గొంప రమేష్, సాహు కార్ శరత్ కుమార్, మంత్రి మంజుల, పప్పల ఆదిలక్ష్మి, పన్నాడ సరోజిని, ఖాదర్ అబ్దుల్లా, నాలి శ్రీనివాసరావు, డొప్ప ప్రసాద్ యాదవ్,రాయపరెడ్డి రేవతి, పత్రి దేవి, రావాడ భవాని, పల్లం నర్సింగరావు, ముమ్మిడివరకు నరసింహమూర్తి, సీత గురుమూర్తి, సంపంగి అప్పలరాజు, బత్తిన రాజు, దాకారపు రాము, హౌసింగ్ బోర్డ్ కాలనీ సెక్రటరీ శ్రీకాంత్, వెంకట అప్పారావు, పరమేశ్వరి, నూకరత్నం, రామచంద్రరావు, ఎండా కృష్ణ, సిరం చిన్నారావు,కటికల కల్పన, బ్రహ్మానంద రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article