రోగులను పరీక్షిస్తున్న డాక్టర్ ప్రజిత్ పాశం..
ఉచిత గుండె వైద్య శిబిరం సద్వినియోగం చేసుకున్న ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రాజేంద్ర ప్రసాద్ నాయుడు.
చంద్రగిరి:
చంద్రగిరి మండలంలోని శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీ వెంకట పద్మావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నందు ఆదివారం ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు. బెంగళూరుకు చెందిన బెలెనెస్ ఛాంపియన్ హాస‌్పిటల్ వారు నిర్వహించనున్న ఉచిత గుండె వైద్య శిబిరంకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 380 మంది వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రముఖ గుండె వైద్య సంబంధిత నిపుణులు డాక్టర్ ప్రజిత్ పాశం వైద్యసేవలు అందిచి… చికిత్సతో పాటు వైద్య శిబిరంలో గుండెకు సంబంధించి కొన్ని రక్త పరీక్షలు చేసి రోగులకు కొన్ని రకాల మందులను కూడా ఉచితంగా పంపిణీ చేసారు. అనంతరం వెంకట పద్మావతి మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాల చైర్మన్ రాజేంద్రప్రసాద్ నాయుడు మాట్లాడుతూ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన పెంచి వారు తీసుకుంటున్న ఆహార అలవాట్ల పై డాక్టర్లు ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. ఈరోజు మా కళాశాల నందు నిర్వహించిన ఉచిత గుండె వైద్య శిబిరంకు అపురూప స్పందన అని తెలిపిన వెంకట పద్మావతి మెడికల్ అండ్ సైన్స్ కళాశాల చైర్మన్ రాజేంద్రప్రసాద్ నాయుడు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది వైద్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.