Saturday, November 30, 2024

Creating liberating content

తాజా వార్తలుదిమ్మె తొలగిస్తారా, మహానుభావులు విగ్రహాలు ఏర్పాటు చేయమంటారా: బడి సుధా యాదవ్.?

దిమ్మె తొలగిస్తారా, మహానుభావులు విగ్రహాలు ఏర్పాటు చేయమంటారా: బడి సుధా యాదవ్.?

చంద్రగిరి:
చంద్రగిరి నియోజకవర్గం వైసిపి సామ్రాజ్యం కాదని, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న సంగతి మర్చిపోయి ఇష్టానుసారం వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని రాష్ట్ర ఒబిసి ఫోరం కన్వీనర్, పుదిపట్ల సర్పంచ్ బడి సుధాయాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం తెల్లవారుజామున పుదిపట్లలో వైసీపీ పార్టీ జెండా కోసం ఆపార్టీ నేతలు అర్థరాత్రిలో దిమ్మె నిర్మాణాం చేపట్టారు. సమాచారం అందుకున్న బడి సుధాయాదవ్ అనుమతి లేకుండా దిమ్మె ఎలా నిర్మిస్తారని మండిపడ్డారు. అర్థరాత్రిలో దొంగలుగా దిమ్మె నిర్మించటం ఏమిటని ప్రశ్నించారు. ప్రశాంతమైన పంచాయితీలో అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. దిమ్మె ను తొలగిస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ జెండా స్థాపిస్తే దానికి అడ్డంగా వైసీపీ జెండా ఏర్పాటు చేయటం, గొడవలు సృష్టించడానికి కాక మరెందుకని ప్రశ్నించారు.

తక్షణం దిమ్మె ను తొలగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, జ్యోతి రావు పూలే, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలను వైఎస్సార్ విగ్రహానికి ముందు నెలకొల్పుతామని అన్నారు. ఒక్క పుదిపట్లలో మాత్రమే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి పంచాయితీలో ప్రతిష్టిస్తామని హెచ్చరించారు. పుదిపట్లలో అంబేద్కర్, జ్యోతి రావు పూలే, ఎన్టీఆర్ విగ్రహాలను కూడా సిద్ధం చేసుకున్నారు. సమాచారం అందుకున్న తిరుపతి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బడి సుధాయాదవ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు.పంచాయితీ అనుమతి ఇవ్వలేదని, అయినా దిమ్మె కట్టారని, దానిని తొలగించకుంటే మహానుభావులు విగ్రహాలు ప్రతిష్ఠాస్తానని స్పష్టం చేశారు. వైసీపీ నేతలతో చర్చించిన పోలీసులు పంచాయితీ అనుమతులు తీసుకుని దిమ్మె ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీంతో వారంతట వారే దిమ్మె ను తొలగించారు. ప్రజాస్వామ్యంలో కుట్ర పూరిత చర్యలు చేపట్టడం మంచి పద్దతి కాదని, మరోసారి పునరావృతం అయితే చూస్తూ ఊరుకోనని మరోసారి స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article