తుని
ఎగిరిందీ పసుపు జెండా.తమ్ముళ్ళు చేయీ,చేయీ కలిపారూ.ఎస్.అన్నవరం పంచాయతీలో యనమల దివ్యకు తిరుగులేదని టీడీపీ జనసేన కూటమి నేతలు కుండబద్దలు కొట్టారు.ఒకప్పుడు దూరమైన క్యాడర్ ఒక్కటవుతున్నారు.పాలనాదక్షుడు యనమల రామకృష్ణుడు పిలుపందుకుని ఇప్పటికే పలువురు స్వగృహ ప్రవేశాలు చేశారు.ఎస్.అన్నవరంలో 1983 నాటి పరిస్తితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.ఆనాడు యనమల రామకృష్ణుడిని అందలం ఎక్కించడంలో ఎస్ అన్నవరమే ఎంతో కీలక పాత్ర పోషించింది.అలనాటి ఇమేజ్ పునరావృతం చేస్తామంటున్నారూ తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు.అప్పన రమేష్, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, వంగలపూడి శ్రీనివాసరావు, వంగలపూడి బుజ్జి నియోజకవర్గ జనసేనాధిపతి చోడిశెట్టి గణేష్ ఈ ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకున్నారు.ఇక ఎన్టీఆర్ ,పవన్,అభిమానులు సరేసరి.దివ్యఅక్కకు ఓట్ల జడివాన కురిపిస్తామంటున్నారు.ఇవాళ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకు ముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆయన తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోలిశెట్టి వీరబాబు, రామచంద్రరాజు, పృధ్వీ రాజ్, స్థానిక నాయకులు ఉగ్గిన రాజు బాబు, కంకిపాటి రమణ, వెలగా ప్రసాద్, ప్రగడ వెంకట సూరి, పందిరి శ్రీను తదితరులు పాల్గొన్నారు