Thursday, November 28, 2024

Creating liberating content

సినిమామరో భారీ సినిమాలో రష్మిక మందన్న..

మరో భారీ సినిమాలో రష్మిక మందన్న..

(విప్పల చందు)
వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతుంది ఈ కూర్గ్ అందం. ఈ భామ ప్రస్తుతం తెలుగులో రెయిన్బో అనే లేడీ సెంట్రిక్ మూవీతో పాటు అల్లు అర్జున్‌తో పుష్ప ది రూల్ మూవీ కూడా చేస్తోంది. ఇటీవలే వారసుడుతో మరో బంపర్ హిట్ అందుకుంది. అది అలా ఉంటే రష్మిక మందన్న కు మరో భారీ అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.రష్మిక మందన్నకు తెలుగుతో పాటు హిందీలో కూడా వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే యానిమల్, మిషన్ మజ్ను, గుడ్ బై వంటి సినిమాల్లో నటించింది. ఇక వీటికి తోడుగా ఆమెకు మరో భారీ సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఛవా అనే హిస్టారికల్ పాన్-ఇండియా సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ సరసన రష్మిక కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. శంభాజీ మహారాజ్ భార్య యేసుబాయి భోంసాలే పాత్రలో రష్మిక నటిస్తోంది. ఛవా చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించనున్నారు. దినేష్ విజన్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. ఇక మరోవైపు రష్మిక ఓ సంచలన రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచు తన సినీ, వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్, ఆడియన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది రష్మిక. ఇక తాజాగా రష్మిక మందన్న తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌లో మొత్తంగా 38 మిలియన్ ఫాలోవర్లని దక్కించుకుని ఒక గొప్ప రికార్డు నమోదు చేసింది. దీంతో ఇండియాలోనే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు కలిగిన హీరోయిన్స్‌లో ఒకరిగా సెన్సేషనల్ రికార్డ్‌ను నమోదు చేసింది రష్మిక మందన్న.. ఇక వరుస హిట్ సినిమాలతో మంచి ఊపు మీదున్న రష్మిక మందన్న రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో వైరల్’గా మారింది. రష్మిక ఒక్కో సినిమాకు 4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. ఇక ఆమె ఆస్తుల విషయానికి వస్తే.. రష్మిక నికర ఆస్తుల విలువ 64 కోట్ల ఉంటుందని.. నెలవారి ఆదాయం 60 లక్షలుకు పైగా, వార్షిక ఆదాయం ఎనిమిది కోట్లకు పైగా ఉంటుందని తెలిపింది సెలెబిట్రీల ఆస్తుల వివరాలను తెలిపే ఓ వెబ్ సైట్. ఈ భామ తన సంపాదనలో ఎక్కువ భాగం ప్రాపర్టీస్‌పై ఇన్వెస్ట్ చేసిందని తెలుస్తోంది. అందులో భాగంగా ఆమె ఈ ఐదు సంవత్సరాల్లో ఓ ఐదు లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ను కొన్నట్లు తెలుస్తోంది. ఇవి ఐదు డిఫరెంట్ ప్లేసుల్లో అని సమాచారం. రష్మిక హైదరాబాద్, గోవా, ముంబై, కూర్గ్, బెంగుళూరు సిటీలో ఖరీదైన అపార్ట్‌మెంట్స్ సొంతం చేసుకుందట. వర్క్ ఫ్రంట్‌లో ఆమె ఇప్పుడు తన కెరీర్‌లో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన పుష్ప 2తో బిజీగా ఉంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది.రష్మిక లేటెస్ట్‌గా తెలుగులో సీతా రామంతో పలకరించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆమె నటించిన మరో సినిమా గుడ్ బై ఇటీవల విడుదలై ఓకే అనిపించుకుంది. రష్మిక గుడ్‌బైతో పాటు హిందీలో మిషన్ మజ్ను అనే స్పై థ్రిల్లర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హిందీ యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించారు. మిషన్ మజ్ను డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాతో పాటు వారిసు అనే తమిళ సినిమాలో నటించారు. తెలుగులో వారసుడుగా డబ్ అయ్యింది. రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగులో పుష్ప2లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. అది అలా ఉంటే ఈ మధ్య హీరోయిన్స్ ఓ వైపు నటిస్తూనే మరోవైపు ఐటెమ్ సాంగ్స్’లో అదరగొడుతోన్న సంగతి తెలిసిందే. గతంలో కాజల్, తమన్నా, పూజా హెగ్డే, సమంత లాంటీ హీరోయిన్స్ చేశారు. ఇక ఇప్పుడు రష్మిక వంతు వచ్చింది.రష్మిక లేటెస్ట్‌గా మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో ఐటెం సాంగ్ చెయ్యడానికి రెడీ అయ్యిందని టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ స్పెషల్ సాంగ్‌లో నటించడానికి రష్మిక దాదాపుగా ఐదు కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. అయితే అంత మొత్తం కూడా ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకున్నట్లు సోషల్ మీడియా టాక్. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. ఒకవేళా అదే నిజమైతే.. ఈ రేంజ్‌లో ఓ పాట కోసం ఇంత రెమ్యూనరేషన్ తీసుకోవడం ఇదో రికార్డ్ అని అంటున్నారు. ఇక ఇటీవల గుడ్ బై సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక లిప్ లాక్ సన్నివేశాల గురించి మాట్లాడుతూ.. ” నాది చాలా సున్నితమైన మనసు. గతంలో నేను చేసిన ‘గీత గోవిందం’ ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో విషయంలో చాలా ట్రోలింగ్‌కు గురైయాను. ఈ రెండు సినిమాల్లోనూ లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయి. ‘గీత గోవిందం’ సినిమాకు పెద్దగా ట్రోలింగ్ జరగలేదు.. అయితే ‘డియర్ కామ్రేడ్’ సమయంలో నేను చాలా ట్రోలింగ్‌కు గురైయాను. నేను కావాలనే పబ్లిసిటీ కోసం విజయ్‌తో అలాంటి సన్నివేశాల్లో నటించానని ఘోరంగా ట్రోల్ చేశారు. ఆ సమయంలో నాకు కొన్నిరోజులు పీడకలలు కూడా వచ్చాయి. మిడ్ నైట్ నేను బైడ్‌పై కూర్చోని ఏడ్చేదాన్ని అంటూ ఏమోషనల్ అవుతూ చెప్పారు. హిందీలో విడుదలైన రష్మిక మొదటి సినిమా గుడ్‌బై. ఈ చిత్రంలో రష్మికతో పాటు అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా, సునీల్ గ్రోవర్ ఉన్నారు. రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగుతో పాటు హిందీ చిత్రాల్లో కూడా నటిస్తూ అదరగొడుతున్నారు. అయితే ఓ వైపు నటిస్తూనే రాజకీయాల్లోకి కూడా వస్తారనే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మిక కర్నాటక నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీచేయనున్నారట. వివరాల్లోకి వెళితే ప్రముఖ తెలుగు జ్యోతిష్యుడు వేణు స్వామి రష్మిక గురించి చేసిన కామంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ.. రష్మిక త్వరలోనే రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. అంతేకాదు ఏకంగా కర్నాట కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి లోక్ సభ ఎంపీ అవుతారని ఆయన అంటున్నారు. వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సెలబ్రిటీల జాతకం చూసి వాళ్ళ జీవితాల్లో జరగబోయే సంఘటనలను ముందుగానే ఊహించి చెబుతారు. గతంలో సమంత విడాకులపై, నయనతార పెళ్లిపై కూడా కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా రష్మిక పొలిటికల్ ఎంట్రీ పై వేణుస్వామి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ కన్నడ అందం ఇపుడు తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతోంది. అంతేకాదు 2020లో నేషనల్ క్రష్‌గా ఎంపికైంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లిగా అదరగొట్టింది. తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన పీరియాడికల్ లవ్ స్టోరీ సీతారామంలో రష్మిక .. అఫ్రీన్ అనే ముస్లిమ్ యువతి పాత్రలో నటించింది. రష్మిక మందన్న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్‌పేట్‌లో ఏప్రిల్ 5, 1996లో జన్మించారు. రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత రష్మిక M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. రష్మిక మందన్న బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో చోటు సంపాదించి అదరగొట్టారు.రష్మిక మందన్న..’గీత గోవిందం’ సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి ‘డియర్ కామ్రెడ్’ సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక, మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కన్నడలో ఆమె పునీత్ రాజ్‌కుమార్ సరసన అంజని పుత్ర, గణేశ్ సరసన ఛమక్ అనే సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో యువ నాగ శౌర్యతో కలసి నటించిన ఛలో ఆమె తొలి తెలుగు సినిమా. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా విజయ్ దేవరకొండతో పాటు మహేష్ బాబు, నితిన్, అల్లు అర్జున్ లాంటీ స్టార్స్‌తో సినిమాల్లో నటిస్తూ అదరగొడుతోంది ఈ కూర్గ్ అందం. పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో అలరించారు రష్మిక మందన్న. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా చేశారు. సుకుమార్ దర్శకుడు. ఈ సినిమా 2021 డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బంపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. పుష్ప తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ‘పుష్ప’ సక్సెస్‌తో ఇటు తెలుగులో కాదు.. ప్యాన్ ఇండియా లెవల్లో ఈ భామ క్రేజ్ అమాంతం పెరిగింది. అందుకే ఇపుడు చేయబోతున్న సినిమాలకు ఏకంగా తన రెమ్యునరేషన్‌ను డబుల్ చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article