గాజువాక:
జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గాజువాక జోన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గొలగాని అప్పారావు పాల్గొని మాట్లాడుతూ, 2023సం,. డిసెంబర్ 26, నుండి 2024సం,. జనవరి 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చెయ్యాలని, లేదా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అనే డిమాండ్స్ తో 16 రోజులు సమ్మె రాష్ట్రమంతా చేస్తే సమ్మె ఒప్పందం, మంత్రులు మినిట్స్, అమలకు సంబంధించి, జీవోలు జారీ విషయములో నేటికి 39 రోజులు ఆలస్యమైనందున మళ్లీ నిరసనలు, ప్రదర్శనలు ర్యాలీలు, ధర్నాలు చెయ్యాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా గాజువాక జోనల్ ఆఫీస్ ఆవరణలో ధర్నా నిర్వహించారు అని అన్నారు. డెత్, సిక్కు, లాంగ్ అఫ్ సెంట్ కార్మికుల వారసుల బిడ్డలకు భర్తీ చెయ్యాలని,, స్వతంత్ర నగర్ డంపింగ్ యార్డ్ లోకి గొడవలు, కొట్లాటలు తగ్గాలి అంటే జివిఎంసి స్టాప్ మాత్రమే యార్డు లోపలకి ఎంట్రీ ఇతరులకు నో ఎంట్రీ కొసం కఠినమైన చర్య తీసుకోవాలన్నారు ఏ.ఎం.ఓ.హెచ్ , సీ.ఎంఓ.హెచ్, జి.వి.ఎం.సి. కమిషనర్, & జిల్లా కలెక్టర్ గారి తెలియజేయడమయింది అని అన్నారు.
గాజువాక జోన్ పరిధిలో నేటికీ జీతాలు మిస్ అయిన వార్డులు 64,65, 67,68, 70,75,77, 79,85,86,87,88, డే అండ్ నైట్ ప్యాకేజీ కార్మికులకు రాలేదు అని అన్నారు. నేటికీ ఐడి కార్డులు జారీ కాని వార్డులు 67,69,79,87,88, డే అండ్ నైట్ ప్యాకేజీ 24,25 వార్కి రాలేదు అని అన్నారు. ఆప్కాస్ లో 2021 విలీనం కాకముందు జూలై నుండి డిసెంబర్ వరకు బకాయి హెల్త్ అలవెన్స్, జీతాలు, చెల్లించాలని, 2023సం,. జూలై నెల నుండి మూడు నెలలు జీతాలు, హెల్త్ అలవెన్స్ బకాయిలు ఉన్నాయి అని అన్నారు. చెత్త డంపింగ్ యార్డ లొకి జివిఎంసి కార్మికుల తప్ప ఇతరులకు లోనికి ప్రవేశించరాదని చర్యలు తీసుకోవాలన్నారు. తదితర డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాము అని అన్నారు.జి వి ఎం సి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సి ఐ టి యు) గాజువాక జోన్ కమిటీ. ఎం రాంబాబు, గొల్ల రాము, గణేష్, నక్క నాగరాజు, మీనాక్షీ, సత్యవతీ , తదితరులు పాల్గొన్నారు