ఉత్తరప్రదేశ్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ దక్కింది. పరువు నష్టం కేసులో యూపీ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. 2018లో అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖల్యు చేశారంటూ బీజేపీ నాయకుడు పరువు నష్టం కేసు ఫైల్ చేశారు. ఓ హత్య కేసులో షా ప్రమేయం ఉందని రాహుల్ అప్పట్లో ఆరోపించారు. ఈ పిటిషన్పై సుల్తాన్ పూర్ న్యాయస్థానం విచారణ జరిపగా.. ఇవాళ రాహుల్ కోర్టుకు హాజరయ్యారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం రాహుల్కు షరతులతో కూడిన బెయిల్ మంజూర్ చేసింది.