Thursday, November 28, 2024

Creating liberating content

హెల్త్ఏ వయసు వరకు పిల్లలతో తల్లిదండ్రులు నిద్రించవచ్చు?

ఏ వయసు వరకు పిల్లలతో తల్లిదండ్రులు నిద్రించవచ్చు?

పిల్లలు ఎంత పెద్దవారైనా పక్కన పడుకోవడం అనేది మనకు అలవాటు. కానీ ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత పిల్లలు ఒంటరిగా నిద్రపోయేలా శిక్షణ ఇవ్వాలని అధ్యయనం చెబుతోంది.పిల్లలతో గడపడం తల్లిదండ్రులకు చాలా ఆనందం. అలాంటి ఆనందం, ఉత్సాహం కోసం తాపత్రయ పడుతారు. ఒకవేళ పిల్లలు హాస్టల్‌లో ఉంటే వారి మీద చూపించే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ప్రతి దశలో పిల్లవాడికి తోడుగా ఉండి సహాయం చేస్తుంటారు. నిద్రపోతున్నప్పుడు కూడా తమ బిడ్డ నిద్రపుచ్చాలని అనుకుంటారు. కానీ చాలా మంది తల్లిదండ్రులకు తమ పిల్లలతో ఏ వయస్సు వరకు నిద్రించాలో తెలియదు.పాశ్చాత్య దేశాలలో శిశువు పుట్టిన కొన్ని సంవత్సరాలకు విడిగా నిద్రపుచ్చడం అలవాటు చేస్తారు. కానీ భారతదేశంలో పిల్లలు దాదాపు 14 నుండి 15 సంవత్సరాల వయస్సు వరకు వారి తల్లిదండ్రులతో పడుకుంటారు. ఇక కొంతమంది పిల్లలకైతే తల్లిదండ్రుల మీద కాలు వేయనిది నిద్రరాదు. అయితే తమాషా ఏంటంటే కరెంటు బిల్లు ఎక్కువై పిల్లలతో పడుకునే తల్లిదండ్రులు ఎక్కువగా ఉన్నారని కూడా ఓ అధ్యయనం చెబుతోంది.పిల్లలను వారి తల్లిదండ్రులతో పడుకోబెట్టడం వారి విశ్వాసాన్ని పెంచుతుంది. తల్లిదండ్రులు తమతో ఉండాలనే ధైర్యంతో ప్రశాంతంగా నిద్రపోతారు. అలాగే తల్లిదండ్రులతో పిల్లల బంధాన్ని దృఢపరిచేందుకు వెంట ఉన్నప్పటికీ పిల్లలకు 3 నుంచి 4 ఏళ్లు వచ్చేసరికి తల్లిదండ్రుల నుంచి విడివిడిగా నిద్రించే అలవాటు చేయడం మంచిదని నిపుణుల అభిప్రాయం.
అయితే పిల్లలకు చిన్నతనం నుండే ప్రత్యేక గదులు ఇచ్చి తల్లిదండ్రులకు విడివిడిగా పడుకునేలా చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. 3 నుండి 4 సంవత్సరాల వయస్సు పిల్లలకి ప్రత్యేక గదిని ఇవ్వడానికి సరైన వయస్సు. వారిని అలా నిద్రపోయేలా చేస్తే మానసికంగా బలంగా తయారవుతారు. పిల్లలు యుక్తవయస్సుకు ముందు దశకు చేరుకున్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో పడుకోవడం మానేయాలి. పిల్లలు యుక్తవయస్సులోకి వచ్చినప్పుడు వారికి గోప్యత ఇవ్వాలి. ఇది వారి భావాలను ట్యూన్ చేయడానికి వారికి సహాయపడుతుంది. పిల్లలు యుక్తవయస్సుకు వచ్చేసరికి తల్లిదండ్రులు విడివిడిగా పడుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే పిల్లలకి ప్రత్యేక గది ఇవ్వడం వల్ల పిల్లల బాధ్యతా భావం పెరుగుతుంది. వారు చిన్న వయస్సు నుండి వారి స్వతంత్రతను ఆనందించవచ్చు. వారికి స్వతహాగా ఆలోచించే జ్ఞానం పెరుగుతుంది.పిల్లలు ఒక నిర్దిష్ట వయస్సు వచ్చిన తర్వాత ప్రతిదీ గమనిస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పడుకోబెట్టే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి పరిస్థితి చిన్న వయసులో మనస్సులలో ముద్రపడిపోతుంది. పిల్లలు చిన్న వయస్సు నుండి ప్రత్యేక గది లేదా మంచానికి అలవాటు పడితే ఇది తల్లిదండ్రులు, పిల్లలకు సౌకర్యవంతంగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article