చంద్రగిరి :
తొండ వాడ గ్రామ పరిధిలోని శ్రీ ఉగ్ర ప్రత్యంగిరా కాళిపీఠంలో శనివారం నుండి 5 రోజులపాటు పంచదశ వార్షిక మహోత్సవాల్లో లక్ష కుంకుమార్చన, సహస్ర కళశాభిషేకం, మరియు చండీ హోమం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటిలో భాగంగా శనివారం ఉదయం 6 గం”లకు అమ్మవారికి అభిషేకం నిర్వహించి, 9 గం”లకు గణపతి , కొండి స్థంబ ఆవిష్కరణ,స్వస్తి వాచనము,కలశ స్థాపన,ఆరాధన అగ్ని ప్రతిష్ట , గణపతి , నవగ్రహ హోములు,సహస్ర కలశ స్థాపన నిర్వహిస్తారని అనంతరం సాయంత్రం 5గం”లకుసహస్రనామార్చన ,ప్రదోషకాల పూజ,నిర్వహిస్తారని ఆలయ పీఠాధిపతిపూజారి సూరి స్వామి తెలిపారు.అదేవిధంగా 25వ తేదీ ఆదివారం ఉదయం 6 గం”లకుఅమ్మవారికిఅభిషేకంనిర్వహించి, ప్రాతః కాలార్చన, ప్రత్యంగిరా మూలమంత్ర హోమములు , శరభేశ్వర హోమము ,లక్ష కుంకుమార్చననిర్వహించి,ప్రదోషకాల పూజ నైవేద్యముమంత్రపుష్పము,హారతి తీర్ధప్రసాద వినియోగం.26వతేదీ ఉదయం అభిషేకం, ప్రాతః కాలర్చన, చండీ హోమము, హనుమ గాయత్రి హోమము,
జయాది హోమము, మహా పూర్ణాహుతి, కలశో ద్వాసన, సహస్ర కళశాభిషేకము, అలంకరణ, అర్చన, నైవేద్యం, మంత్ర పుష్పము, ప్రసాదం నిర్వహించి సాయంత్రం 5గం”లకు శ్రీ ప్రత్యంగిరా సహస్రనామార్చన నిర్వహిస్తారని తెలిపారు. 26వ తేదీ ఉదయం అభిషేకం నిర్వహించి,10 గం”లకు శ్రీ ప్రత్యంగిరా హోమము, కాలభైరవ హోమము, దశ మహా విద్య హోమము, మంత్రపుష్పము నైవేద్యం నిర్వహిస్తారని ఆయన తెలిపారు. 28వ తేదీ పంచామృత అభిషేకం నిర్వహించి, పట్టు వస్త్రములు కట్టి ,బంగారు ఆభరణాలు, సువాసనలు వెదజల్లే పుష్పాలతో అలంకరించి, ధూప, దీప, నైవేద్య ,హారతులు ఇచ్చిభక్తులకు దర్శన ఏర్పాట్లు గావించిరి. సాయంత్రం5గం”లకు ఉత్సవ మూర్తిని వాహనం మండపంకు తీసుకువచ్చి శ్రీ ప్రత్యంగిరా కాళి అలంకరణ గావించి సింహా వాహనము పై అధిష్టింపజేసి తొండవాడ, చంద్రగిరి గ్రామ పరిధిలో ఊరేగింపు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు పూజారి శివశంకర్ ప్రసాద్, వడ్డీ కాసుల రామమూర్తి నాయుడు,వేద పండితులు జి.సీతారామ శర్మ పాల్గొన్నారు.