రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి
ఒంటిమిట్ట:
లైబ్రరీల ద్వారా స్వీయ అధ్యయనం సాధ్యం. అని రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి అన్నారు శుక్రవారం నాడు ఒంటిమిట్ట మండలం చింతరాజు పల్లి గ్రామంలో డిజిటల్ లైబ్రరీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
అరచేతిలో విజ్ఞానాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘డిజిటల్ లైబ్రరీ’ని అందుబాటులోకి తెచ్చినట్లు స్వీయ అధ్యయనం ద్వారా విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించడానికి లైబ్రరీలు, ప్రస్తుత ఆధునిక, సాంకేతిక పరిస్థితుల్లో డిజిటల్ లైబ్రరీలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. శుక్రవారం చింతరాజుపల్లిలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించిన డిజిటల్ లైబ్రరీని స్థానిక ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. అంతకుముందు రూ.20 లక్షల అంచనాతో రూపొందించిన ప్రహరీని ప్రారంభించారు. ప్రాంగణంలో కలియ తిరిగారు. ప్రజలను పేరు పేరున పలకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మొబైల్ ఫోన్లు, టీవీలపై ఆధారపడిన విద్యార్థులను పుస్తక పఠనం వైపు మళ్లించేందుకు డిజిటల్ లైబ్రరీలు దోహదపడతాయన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు అవసరమైన అన్నీ స్టడీ మెటీరియల్స్.. న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఇప్పటికే సచివాలయం భవనం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రంతో పాటు పాలశీతలీకరణ కేంద్రం, ఇప్పుడు డిజిటల్ లైబ్రరీతో ప్రభుత్వ సేవలు ఒకే ప్రాంగణంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు.ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో అద్భుతంగా రూపొందాయని వెల్లడించారు. డిజిటల్ లైబ్రరీ, ప్రహరీ నిర్మాణం అత్యద్భుతంగా తీర్చిదిద్దిన కాంట్రాక్టర్ ను అభినందించారు. ప్రజలతో కలిసి ఎమ్మెల్యే ఆత్మీయ విందు చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగమ్మ, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ సభ్యులు ఆకెపాటి వేణుగోపాల్ రెడ్డి మండల కన్వీనర్ గజ్జల శ్రీనివాసులు రెడ్డి, పార్టీ నాయకులు బొడ్డే వెంకట రమణ,భాస్కర్ నరసింహ నాయుడు,యర్రయ్య వెంకట సుబ్బయ్య, శ్రీను, నారాయణ, యామన వెంకట సుబ్బయ్య, అబ్బన్న వెంకట సుబ్బయ్య , రాసోల చిన్నబ్బి, కదరయ్య మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.