నరసరావుపేట: వైసీపీకి ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ కు పంపించారు. గజనీలాంటి మనస్తత్వం కలిగిన మీతో కలసి తాను పని చేయలేనని లేఖలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. పార్లమెంటరీ సభ్యత్వం నుంచి అనర్హులుగా చేయడానికి మొహమ్మద్ గజినీలా చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకూ మీరు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని రాజీనామా లేఖలో రఘురామ పేర్కొన్నారు. ప్రయత్నించిన ప్రతిసారీ, మీ శత్రుత్వం, దురుద్దేశపూరిత క్రూరమైన చర్యలు ఉన్నప్పటికీ, గత మూడున్నర సంవత్సరాలుగా నర్సాపురంలో తన నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేశానన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం సేవ చేయాలనే తన దృఢ నిశ్చయానికి గుర్తుగా.. వైసీపీ ప్రాథమిక క్రియాశీల సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖలో రఘురామ తెలిపారు.