Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుఅమృత ఆహారం పండించి ఆరోగ్యంగా జీవించండి

అమృత ఆహారం పండించి ఆరోగ్యంగా జీవించండి

  • జియ్యని శ్రీధర్, డిప్యూటీ మేయర్, జి వి ఎం సి
    విశాఖ:
    అమృత ఆహారం పండించి ఆరోగ్యంగా జీవించండి అని జి వి ఎం సి డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఉదయం సింహాచలం గోశాలలో (జైలు రోడ్డు లో) కూరగాయ మొక్కలకు అంట్లు కట్టె శిక్షణా కార్యక్రమం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ దారుల సంఘం నిర్వహించింది. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ – కూరగాయ మొక్కలకు అంట్లు కట్టడం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. అలాగే జీవామృతం, మట్టి, దేశీయ ఆవుల ఎరువు, కూరగాయ మొక్కల నారు పంపిణీ చేయడం చాలా అభినందనీయం అన్నారు. జివిఎంసి లో ఒక సమావేశం నిర్వహించి నగరవాసులు అందరితో మొక్కలు పెంచేందుకు ప్రోత్సాహం అందించడం జరుగుతుంది అని పేర్కొన్నారు.సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస మూర్తి మాట్లాడుతూ రైతులకు చేయూత ఇవ్వడం ఒక పనిగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. దేవస్థానం లో ఉన్న ప్రకృతి ఆరోగ్య కేంద్రంను అందరూ సందర్శించి దాని వల్ల కలిగే ఉపయోగాలు తెలుసు కోవాలి అని కోరారు.
  • శాసనమండలి మాజీ సభ్యులు పివి మాధవ్ మాట్లాడుతూ రసాయన ఎరువులు రసాయన క్రిమి సంహారకాలు రసాయన కలుపు తీత మందులు లేకుండా ప్రకృతి ఆధారిత ఆహారమే ఆరోగ్య కరమైనదని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద కూరగాయలు ఆకుకూరలు పండ్లు పండించు కోవాలి అని కోరారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం శ్రేయస్కరం అని వివరించారు.ఈ కార్యక్రమంలో ఆకుల చలపతిరావు, రావులపాలెం విజయరాజు, కర్రి రాంబాబు తదితరులు కూరగాయ మొక్కలు అంట్లు కట్టడం మీద శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారుఈ కార్యక్రమంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, కార్యదర్శి పాలెం నేచురల్స్ చెవ్వాకుల అశోక్, కోశాధికారి సాయిబాబు, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ దారుల సంఘం రాష్ట్ర ప్రతినిధి పి ఎల్ ఎన్ రాజు , అగ్రికల్చరల్ సైంటిస్ట్ అశోక్ కుమార్, సంస్థ ప్రతినిధులు , పోదీశ్వర్ పురోహిత్, చిన్న పిల్లల వైద్యనిపుణులు డాక్టర్ రామకృష్ణ, పిచ్చుకల పరిరక్షణకు కృషి చేస్తున్న మాస్టర్ కె దారి నాయుడు, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్ జి ఒ కార్యదర్శి జెవి రత్నం తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article