Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలునిరుపేద చిన్నారులను ఆదుకోవాలి: డా. చప్పిడి

నిరుపేద చిన్నారులను ఆదుకోవాలి: డా. చప్పిడి

రామచంద్రపురం

ప్రతీఒక్కరూ నిరుపేదలైన చిన్నారులను ఆదుకోవాలని డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు కోరారు. ఈమేరకు ఆదివారం అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు అలై కిరణ్ కుమార్ అధ్యక్షతన జగన్నాధపురం నందుగల రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ నందు ఉప్పాడ కొత్తపల్లి ప్రాధమిక ఆరోగ్యకేంద్రం లో పనిచేస్తున్న రవిబాబు సోదరి నూకరత్నం పుట్టినరోజు సందర్భంగా హోంనందుగల చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలను నిర్వహించుకుని చిన్నారులకు అన్నదానం చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అలై డాక్టర్. చప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో గల పేద పిల్లలను ఆదుకోవాలని కష్టాల్లో ఉన్న పిల్లలకు సహాయం చేస్తూ వారి చదువుకు ఎంతోకొంత ఉపయోగపడుతూ వారిని ప్రోత్సహించినప్పుడు భవిష్యత్తులో వారు ఉన్నతమైన శిఖరాలకు చేరుకుని సమాజానికి ఉపయోగపడతారని అన్నారు. కార్యక్రమంలో ముందుగా నూకరత్నం కేక్ కట్ చేసి చిన్నారులకు స్నాక్స్ కేకు పంపిణీ చేయడం జరిగింది అలాగే చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం చాలా ఆనందాన్ని కలిగించిందని తెలియజేయడం జరిగింది. అలాగే స్వాతి హెల్పింగ్ హాండ్స్ చేస్తున్న సేవలు అభినందనీయమైనవని ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి సమాజానికి ఉపయోగపడాలని కోరడం జరిగింది. కార్యక్రమంలో జడ్ సి అలై దుర్గాసుభద్ర, మేము సైతం మీకోసం క్లబ్ ప్రెసిడెంట్ అలై గణేష్, సేవాశక్తి ప్రెసిడెంట్ అలై లక్ష్మీ నాగేంద్ర క్లబ్, కె. సుధాకర్, జి. శైలజ, ఎన్ మహేష్, బేబీ ఆరాధ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article