కుప్పం బ్రాంచ్ కెనాల్ ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్
కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను అందించారు సీఎం జగన్. సోమవారం కుప్పంలో పర్యటించిన సీఎం జగన్ ముందుగా పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసి, కుప్పం బ్రాంచ్ కెనాల్ ను జాతికి అంకితం చేశారు. కుప్పం ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు లేకుండా చేస్తామన్న మాటను నిలబెట్టుకున్నామని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. కుప్పం, పలమనేరులోని 4.02 లక్షల జనాభాకు తాగునీరు అందనున్నట్లు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 4.02 లక్షల జనాభాకు తాగు నీరు అందిస్తూ అందించేందుకు కృష్ణా జలాలను సీఎం జగన్ విడుదల చేశారు. అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ. 560.29 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ ను సీఎం జగన్ ప్రారంభించారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలు విడుదల చేశారు.