ఘనంగా జరిగిన “వాలంటీర్లకు వందనం” కార్యక్రమం వాలంటీర్లను సత్కరించిన ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పోలవరం ఇంచార్జ్ తెల్లం రాజ్యలక్ష్మి
జీలుగుమిల్లి:భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు దుష్టె ప్రధానమంత్రి ముఖ్యమంత్రి తర్వాత ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు ఆదిపత్యం కొనసాగుతుందని పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు అన్నారు.
నిస్వార్థంగా ప్రజల కోసం సేవలు అందిస్తున్న వాలంటీర్లకు గుర్తింపుగా, జగనన్న ప్రభుత్వం నిర్వహిస్తున్న “వాలంటీర్లకు వందనం” కార్యక్రమం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఉత్తమ సేవలకు గాను ఎంపికైన వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పోలవరం ఇంచార్జ్ తెల్లం రాజ్యలక్ష్మి తో కలిసి ప్రదానం చేశారు.ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకువచ్చిన పరిపాలన సంస్కరణలలో భాగంగా, తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామని, ప్రతి విషయంలో అధికారులు స్థానిక నాయకులు సహకరిస్తున్నట్లు ఎమ్మెల్యే వారిని ఆదర్శంగా తీసుకొని తాము ముందుకి సాగుతున్నట్లు కొంత మంది వాలంటీర్లు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పోలవరం ఇంచార్జ్ తెల్లం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ .. వాలంటీర్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని, వారి అవిశ్రాంత కృషి కారణంగానే నియోజకవర్గానికి మంచి పేరు వస్తోందని పేర్కొన్నారు. ఈరోజు వాలంటీర్ ఏ రకమైన గుర్తింపు పొందినా, తనకు మాత్రం వాలంటీర్లందరూ వజ్రాలే అని, మా ప్రభుత్వానికి కొండంత అండ అని ఆమె అన్నారు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగాలంటే జగనన్న ప్రభుత్వం ఉండాలని, లేకపోతే మళ్ళీ జన్మభూమి కమిటీల రాజ్యం తీసుకువచ్చి వాలంటీర్లు చేసిన మంచి పనులన్నిటికీ చరమ గీతం పాడాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్న విషయాన్ని అర్ధం చేసుకోవాలని కోరారు. రాబోయే 2 నెలలపాటు వాలంటీర్లు ఎటువంటి పొరపాట్లు జరగకుండా ప్రతి ఒక్కరు డేగ కన్ను వేసి ఉంచాలని మరింత మెరుగైన కృషి చేసి ప్రతి కుటుంబానికి జగనన్న చేసిన మేలును గుర్తు చేయాలని చెబుతూ, వారికి దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వసంతరావు సొసైటీ చైర్మన్ బోధ శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ ప్రసాదు ఎంపీటీసీలు సర్పంచులు మండలంలోని పాండు పంచాయతీల 16 సచివాల వాలంటీర్లు వైసీపీ సీనియర్ నాయకులు మండల నాయకులు, సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.